Friday, November 15, 2024

TG – రేవంత్ …. ఆ విశ్రాంత అధికారిని అవ‌మానించ‌డం సిగ్గుచేటు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : ఆహ్వానించింది మీరే.. అరెస్ట్ చేసింది మీరే.. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని, పోలీసు అమరవీరుల దినోత్సవం రోజే అవమానించడం సిగ్గుచేటని బీఆర్ ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. పోలీసుల పట్ల కపట ప్రేమకు ఇది మరో నిదర్శనమ‌ని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు ప్రభుత్వాలు పని చేయాలి గానీ, ఇలా అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ నిర్బంధాల పాలన చేయడం దుర్మార్గం అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. గ్రూప్-1 రద్దు చేయాలని వివాదం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత‌ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశార‌ని తెలిపారు. పోలీసు ప‌రేడ్‌కు ర‌మ్మ‌న్ని ఆహానించి, నిర్బంధంలో ఉంచ‌డం వ‌ల్ల ఆయ‌న ఆ కార్య‌క్ర‌మానికి వెళ్ల‌లేక‌పోయార‌ని పేర్కొన్నారు.

నేనేమైనా ఉగ్ర‌వాదినా..

పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినం సంద‌ర్భంగా ప‌రేడ్‌కు రావాల‌ని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు ప్ర‌భుత్వం నుంచి అందింది. కానీ ఆర్ఎస్పీని నిన్న రాత్రిలో గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు. ఇది స‌రైనా ప‌ద్ధ‌తేనా అని డీజీపీని ఆర్ఎస్పీ ప్ర‌శ్నించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు సోదరులకు నివాళులు అర్పించే అర్హత కూడా నాకు లేదా? నేనేమైనా టెర్రరిస్టునా..? అని నిల‌దీశారు. రేవంత్ రెడ్డి గారూ.. ఎందుకు ఇంత భయపడుతున్నారు మేమంటే? ఎన్నాళ్లీ ఈ అరాచకాలు..? అని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement