రుణ మాఫీ జాప్యంతో కొండలా పెరిగిన మిత్తి
రైతులకు కొత్త సమస్యలు
కొసరు కడితేనే రుణమాఫీ అంటూ బ్యాంకులు వేధింపులు
ఆ సంగతి చూడమంంటూ రేవంత్ కు హరీశ్ ట్విట్
అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ప్రతినిధి : తెలంగాణలో రైతుల రుణమాఫీ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ తొమ్మిదో తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పి ఏడు నెలల కాలయాపన చేసిందన్నారు. దీంతో, రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. డిసెంబర్ తొమ్మిదో తేదీన రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారన్నారు. ఏడు నెలల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని రేవంత్ దృష్టికి తెచ్చారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేదిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని రైతులు బాధపడుతున్నారని పేర్కొన్నారు.
ఇదుగో రైతుల ఇబ్బందుల చిట్టా ..
ప్రభుత్వం తక్షణం స్పందించి, డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రేవంత్ ను కోరారు హరీశ్ . ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట్ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్ లోన్‌ను, రూ.9వేలు మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్ చేశారని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తనకు రైతులు పంపిన విజ్ఞప్తులను పరిశీలనకు పంపుతున్నానని, వాటిని వెంటనే పరిష్కరించాలని సిఎంను కోరారు