నిజామాబాద్ జిల్లా ప్రతినిధి : (ఆంధ్రప్రభ)నిజామాబాద్ జిల్లాలో గ్రూప్-3 మొదటి స్టేషన్ పరీక్షలు ఉదయం ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. అభ్యర్థులు సమయానికి ముందే పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 19,941 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సింది ఉంది. 66పరీక్షా కేంద్రాలో, 22 మంది ఫ్లయింగ్ స్క్యాడ్స్ పర్య వేక్షణలో గ్రూప్ 3 పరీక్షలు కొనసాగుతు న్నాయి.హాల్ టికెట్లతో వచ్చిన అభ్యర్థులను క్షుణ్ణం గా తనిఖీ చేసిన తర్వాతనే లోనికి పంపించారు.
పరీక్షా కేంద్రంలోనికి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పుస్త కాలకు ఏలాంటి అనుమతిం చలేదు. సిట్టింగ్ స్క్వాడ్ బృందం అనుక్షణం నిశితంగా పర్యవేక్షిస్తున్నా యి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. సెకండ్ సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. దూర ప్రాంతా ల నుంచి వచ్చే అభ్యర్థులు కొద్దిగా ఆలస్యం కావడంతో పరుగు పరుగున సమయా నికి పరీక్షా కేంద్రానికి హాజర య్యారు.
కొన్నిచోట్ల ఆల స్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులకు అధికారులు అనుమతించ కపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
*ఆలస్యం కావడంతో వెనుదిరిగిన అభ్యర్థులు*
నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కళాశాల పరీక్షా కేంద్రంలో ముబారక్ నగర్ నుంచి ఒకరు, కామారెడ్డి నుంచి ఒకరు, మొత్తం ఇద్దరు అభ్యర్థులు గ్రూప్ 3 పరీక్షకు ఆలస్యంగా వచ్చాడు. దీంతో నిరాశతో అభ్యర్థి వెనుదిరి గాడు.
*చంటి పిల్లతో పరీక్ష కేంద్రాల వద్ద*
పరీక్ష రాసేందుకు చంటిపిల్లల తల్లులతో గ్రూప్ త్రీ పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు వెళ్లే సమయంలో చిన్నారులను తమ భర్త,బంధువులకు అప్పచెప్పుతూ వెళ్తున్న దృశ్యాలు ఆంధ్రప్రభ కెమెరా క్లిక్ మనిపించింది. ఈ నేప థ్యంలో చిన్న పిల్లల ఆలనా పాలనా చూసేందుకు కుటుం బసభ్యులు పరీక్ష కేంద్రాల వద్ద వేచి ఉన్న దృశ్యాలు కనిపించాయి.