సిరిసిల్ల ఆంధ్రప్రభ – గ్రూప్ 2 పరీక్ష ప్రారంభమైంది. ఆదివారం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగానే పరీక్షా కేంద్రాల గేట్లను అధికారులు మూసివేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిధిలో ఉన్న 26 గ్రూప్ -2 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. సిరిసిల్ల,వేములవాడ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు పలు ఆదేశాలిచ్చారు.ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సి.ఐ లు సిబ్బంది ఉన్నారు.