Friday, September 6, 2024

TG – ఉప ముఖ్యమంత్రి భ‌ట్టితో గ్రూప్ 2, 3 అభ్యర్ధుల చ‌ర్చ‌లు స‌ఫ‌లం

ఆంధ్ర‌ప్ర‌భ స్టార్ట్ – హైదరాబాద్‌: ముందుగా షెడ్యూల్ ప్ర‌క‌టించిన గ్రూప్ 2, 3 ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి.. ఈ మేర‌కు నిరుద్యోగులు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టితో జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయి.. ప‌రీక్ష‌లు వాయిదాకు ప్ర‌భుత్వం అంగీక‌రించింది. కాగా డీఎస్సీ, గ్రూప్ 2 , పరీక్షల మధ్య వారం రోజుల మాత్రమే వ్యవధి ఉండటంతో వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

దీనిపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో నేడు సచివాలయంలో అభ్యర్థులు చర్చించారు. అభ్యర్థులతో చర్చల అనంతరం భ‌ట్టి .టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. డిసెంబరులో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దీంతో ఓవర్‌ ల్యాపింగ్‌ లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని మ‌హేంద‌ర్ రెడ్డి చెప్పారు. అలాగే గ్రూప్ 3 ప‌రీక్ష‌ల‌కు కొత్త తేదిన ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు.

- Advertisement -

ఇది ఇలా ఉండ‌గా, . రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని మార్చి నెలలో కమిషన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రూప్‌ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప‌రీక్ష‌కు వారం రోజులు ముందు డిఎస్సీ ప‌రీక్ష‌లు ఉండ‌టంతో వాయిదాకు అభ్య‌ర్ధులు ఉప ముఖ్య‌మంత్రిని అభ్య‌ర్ధించారు.. ఆయ‌న సానుకూలంగా స్పందించి వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు..

నిరుద్యోగులకు మరో శుభవార్త ..

నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో తీపి కబురు చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగుల కోసం అంబేడ్కర్‌ నాలెడ్జ్ సెంటర్లు ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 వరకు ఆన్ లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. కోచింగ్ ఇచ్చేందుకు విషయ నిపుణులను తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్‌లో పాఠాలు బోధిస్తారని స్పష్టం చేశారు. అభ్యర్థులకు వచ్చే సందేహాలను ఆయా కేంద్రాల్లోనే డౌట్స్ క్లియర్ చేస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌ను త్వరలోనే ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.

ఇక అభ్య‌ర్దుల‌తో జ‌రిగిన చ‌ర్చ‌ల‌లో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ కూడా పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement