Friday, November 22, 2024

TG: కేటీఆర్ తో గ్రూప్ 1 అభ్య‌ర్ధుల భేటి..

ప‌రీక్ష‌లు వాయిదాకు విన్న‌పం
పిలిమ్స్ ప్ర‌శ్నాప‌త్ర‌మే త‌ప్పుల త‌డ‌క‌
దీనికి తోడు రిజ‌ర్వేష‌న్ ల‌లో కోత‌
త‌మ స‌మ‌స్య‌ల గోడును వినిపించిన అభ్య‌ర్ధులు
సానుకూలంగా స్పందించిన కెటిఆర్
దీనిపై న్యాయ స‌ల‌హా తీసుకుంటాన‌ని హామీ
ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని భ‌రోసా

హైద‌రాబాద్ : తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో గ్రూప్ -1 అభ్య‌ర్థులు స‌మావేశ‌మ‌య్యారు. గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు వాయిదా వేసేలా స‌ర్కార్‌పై ఒత్తిడి తేవాల‌ని కేటీఆర్‌కు అభ్య‌ర్థులు విన్న‌వించారు. ఈ సంద‌ర్భంగా అభ్య‌ర్థుల స‌మ‌స్య‌ల‌ను కేటీఆర్ విన్నారు. అయితే గ్రూప్-1 మెయిన్స్‌ను రీ షెడ్యూల్ చేయాల‌ని గ‌త కొద్ది రోజుల నుంచి అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కానీ కాంగ్రెస్ స‌ర్కార్ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

ఇది ఇలా ఉంటే ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ గ‌త రాత్రి వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా పలువు అభ్యర్థులు మాట్లాడుతూ జీవో 29, జీవో 55పై ఎటూ తేల్చకుండా, తప్పుడు ప్రశ్నల అంశాన్ని పరిష్కరించకుండా ఆగమేఘాల మీద గ్రూప్‌ -1 మెయిన్స్‌ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు గ్రూప్‌-1 పరీక్ష ప్రిలిమ్స్‌లో అన్ని ప్రశ్నలూ తప్పులతడకలేని, 150 ప్రశ్నలకు 20 ప్రశ్నలు తప్పుగా వచ్చాయని గుర్తుచేశారు. ఈ కేసులన్నీ పరిష్కరించిన తర్వాతే మెయిన్స్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఇదే విష‌యాన్ని కెటిఆర్ కు కూడా అభ్య‌ర్ధులు వివ‌రించారు. దీనిపై కెటిఆర్ సానుకూలంగా స్పందిస్తూ, దీనిపై న్యాయ స‌ల‌హా తీసుకుంటామ‌ని హామీ ఇచ్చారు.. అభ్య‌ర్దుల‌కు అన్నివిధాల అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు కెటిఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement