Friday, October 18, 2024

TG – పిసిసి చీఫ్ తో గ్రూప్ 1 అభ్య‌ర్ధుల భేటి …

జివో నెంబ‌ర్ 29ని రద్దు చేయాల‌ని విన‌తి
మ‌ళ్లీ ప్రిలిమ్స్ నుంచి ప‌రీక్ష‌ల ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని డిమాండ్
పాత జివో ప్ర‌కారమే ఎగ్జామ్ జ‌ర‌పాల‌ని అభ్య‌ర్ధ‌న‌
గ‌త ప్ర‌భుత్వంలో ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేశారంటూ
కెటిఆర్ ను నిల‌దీసిన మ‌హేష్ కుమార్ గౌడ్

హైద‌రాబాద్ – గాంధీ భవన్ లో గ్రూప్-1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల డిమాండ్లను తెలుసుకున్నారు. జీవో 29 రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. పాత జీవో 55 ప్రకారం పరీక్షల నిర్వహణ జరగాలన్నారు. పాత నోటిఫికేషన్ లో ఇచ్చిన 503 పోస్ట్ లలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వవద్దన్నారు.
పెంచిన 60 పోస్ట్ ల్లో మాత్రమే కొత్తగా అప్లై చేసుకున్న వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు. (ప్రభుత్వం కొత్తగా 503 పోస్ట్ ల్లో60 పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇచ్చింది). జీవో 29 , రిజర్వేషన్ల అంశాల్లో కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయ‌ని, వాటిని పరిష్కరించి పరీక్షలు పెట్టాలనిమ‌హేష్ ను కోరారు.

పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరి ప్రకారం పరీక్షలు ఉండాలని అన్నారు. గ్రూప్స్ 1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు ప్రభుత్వానికి సమాచారం అందిస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. సాయంత్రం వరకు దీనిపై త‌గిన సమాచారం ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

కెటిఆర్ కు స‌వాల్ .
మరోవైపు కేటీఆర్ పై పీసీసీ చీఫ్ ఫైర్ అయ్యారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా..? అంటూ కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్ విసిరారు. నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని కేటీఆర్ ను విమ‌ర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో నే.. డీఎస్సీ.. వైద్యారోగ్యశాఖ లో ఉద్యోగాలు. గ్రూప్స్.. పోలీసు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మీరు ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement