Friday, November 22, 2024

TG ఈరోజే గుడ్‌న్యూస్‌ చెబుతాం ….. ఉద్యోగ సంఘాల‌కు భ‌ట్టి హామీ

ఉప‌ముఖ్య‌మంత్రితో జాక్ నేత‌ల భేటీ
వివిధ అంశాల‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు
డీఏల‌ను విడుద‌ల చేయాల‌ని అభ్య‌ర్థ‌న‌
సానుకూలంగా స్పందించిన భ‌ట్టి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెబుతామ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఉద్యోగుల స‌మ‌స్య‌లు తీర్చ‌డంలో త‌మ ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉంటుంద‌ని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో శ‌నివారం ప్రజాభవన్ కార్యాల‌యంలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగ సంఘాల ప్ర‌తినిధులు గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన మూడు పెండింగ్ డీఏలు, ఈ ప్రభుత్వంలో రావాల్సిన రెండు డీఏలను వెంటనే రిలీజ్ చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. దీనిపై భ‌ట్టి సానుకూలంగా స్పందించారు.

సానుకూలంగా సీఎం రేవంత్‌..

డీఏల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై చర్చించి, కనీసం ఒక‌ డీఏ అయినా ఈ రోజు ప్రకటించేందుకు ప్రయత్నిస్తామని ఉద్యోగులకు చెప్పారు. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌తో ఉద్యోగ సంఘాలు భేటీ అయి ఇదే విషయాన్ని వెల్లడించగా.. సీఎం రేవంత్‌ సానుకూలంగా స్పందించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై చర్చించి, పరిష్కారం కోసం ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తామని, ఆ కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఉంటారని ప్రకటించారు. వారి నివేదిక ఆధారంగా నిర్ణ‌యాలు తీసుకుంటామ‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే ఉద్యోగ సంఘాల నేత‌లు భ‌ట్టితో భేటీకావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement