Wednesday, November 20, 2024

TG | రైతులకు గుడ్ న్యూస్… పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై సుంఖం పెంపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆయిల్‌ పామ్‌ రైతులకు శుభవార్త. రైతులు పండించిన ఆయిల పామ్‌ గెలలకు ఇకపై అధిక ధర రానుంది. దీంతో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్న రైతుల కష్టాలు దూరం కానున్నాయి. పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంఖాన్ని పెంచడంతో ఆయిల్‌ పామ్‌ సాగు రైతులకు మంచిరోజులు రానున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అయ్యే పామ్‌ అయిల్‌పై దిగుమంతి సుంఖం 5.5శాతంగా నే ఉంది.

ఇకపై అది 27.5శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో దేశీయంగా సాగవుతున్న ఆయిల్‌ పామ్‌ గెలల ధరలు పెరిగే అవకాశం ఉంది. దిగుమతి సుంఖం 5.5శాతంగా ఉండడంతో ఇప్పటి వరకు విదేశాల నుంచి పామ్‌ ఆయిల్‌ పెద్ద ఎత్తున దిగుమతి అయింది. దీంతో తెలంగాణలో పండించిన పామ్‌ ఆయిల్‌ గెలలు టన్ను ధర రూ.12,000 నుంచి రూ.13వేల మధ్యనే పలుకుతోంది.

అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా దిగుబతి 27.56శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో టన్ను అయిల్‌ పామ్‌ గెలల ధర టన్నుకు ఇకపై రూ.15వేల నుంచి రూ.17వేల దాకా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా పామాయిల్‌ ధర కనీసం టన్నులకు రూ.1లక్ష వరకు ఉండనుంది. గతంలో ముడిపామ్‌ ఆయిల్‌ దిగుమతిపై సుంకం ఎత్తివేయడంతో రాష్ట్రంలో సాగవుతున్న ఆయిల్‌ పామ్‌ గెలల ధర తగ్గి రైతులు నిరాశకు లోనవుతున్నారు.

అదే సమయంలో కొత్తగా ఆయిల్‌ పామ్‌ వైపు సాగు వేయాలనుకున్న రైతులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన నేషనల్‌ మిషన్‌ ఆన్‌ఎడిబుల్‌ ఆయిల్స్‌- ఆయిల్‌ పామ్‌ ద్వారా రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగు పథకం అమలవుతోంది.

రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణ వేగంగా జరుగుతుండగా… 14 కంపెనీలకు అనుమతులు వచ్చాయి. ఇందుకోసం ఆయిల్‌ పామ్‌ కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా44 నర్సరీలు ఏర్పాటు-చేశాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2.00 లక్షల ఎకరాలను ఆయిల్‌ పామ్‌ సాగు అవుతోంది.

- Advertisement -

ఇప్పటికే సాగులో ఉన్న 44,400 ఎకరాల పామ్‌ ఆయిల్‌ తోటల నుండి 2.80 లక్షల టన్నుల ఆయిల్‌ పామ్‌ గెలల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై సుంకం పెంచడంతో రాష్ట్రంలోని దాదాపు 10వేల మంది ఆయిల్‌ పామ్‌ రైతులకు అధనంగా లబ్ధి చేకూరనుంది. పామ్‌ ఆయిల్‌ దిగుమతిపై భారత ప్రభుత్వం ఏటా 80 వేల కోట్ల రూపాయల విదేశిమారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తోంది.

పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై సుంఖాన్ని పెంచాలని తద్వారా రైతులకు అధిక ధరలను అందించొచ్చని ఇటీ-వల లేఖ ద్వారా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి విజ్ఞప్తిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సానుకూలంగా స్పందిస్తూ పామ్‌ ఆయిల్‌ దిగుమతులపై దిగుమతి సుంఖాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖకు లేఖ ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement