Friday, November 22, 2024

TG – పంచాయ‌తీల‌లో నిధుల కొర‌త ఉంది – మంత్రి పొంగులేటి

ఖ‌మ్మం – గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాల భారిన పడిన వారిని మంత్రి సందర్శించారు. గత గడిచిన పది సంవత్సరాల కాలంలో గ్రామాల్లో మౌలిక వస్తులపై నిర్లక్ష్యం వహించటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. మొన్నటి వరకు తాను నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగానని తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతులు సరిగా లేవని తెలిపారు. తాము అంత చేసాం ఇంత చేసామనే గ‌త‌ ప్రభుత్వం ఏమి చేయలేదన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం ఒక పాలేరు నియోజకవర్గం లోనే కాదు రాష్ట్రమంతా పేదలకు అండగా ఉంటామన్నారు.

గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. వీలైనంతవరకు ఈ రోజే ముఖ్యమంత్రితో మాట్లాడతానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలు రాష్ట్రానికి ఆయువుపట్టు అన్నారు. గ్రామీణ ప్రాంతాలకి రావలసిన నిధుల కొరతను ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడి గ్రాంట్ వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తానని అన్నారు. ధనిక తెలంగాణ అని చెప్పుకున్న గత ప్రభుత్వం చూస్తే మౌలిక వసతులకే కొరత కనపడుతుందని తెలిపారు. నేను గత ప్రభుత్వం మీద నింద మోపటం కాదు మౌలిక వసతులే సరిగా చేసుకోలేకపోయారని చెప్తున్నా అన్నారు. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తాం ఇదే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కాగా ఇదే స‌మ‌యంలో కూసుమంచిలో ముఖ్య‌మంత్రి స‌హాయ నిధిని 120మంది ల‌బ్దిదారులకు అంద‌జేశారు..

- Advertisement -

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం

సీజనల్ వ్యాధుల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం , సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. తిరుమలాయ పాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో విష జ్వరాలతో బాధపడుతున్న వారిని ఆయ‌న‌ పరామర్శించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బాధితుల‌కు ప్రభుత్వం అండగా ఉంటుందని, జ్వ‌రాల అదుపున‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ ముజ్జిమిల్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతీ, పంచాయతీ రాజ్ ఇ ఇ వెంకటరెడ్డి, మిషన్ భగీరథ ఇఇ లు పుష్పలత, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ కె. శేషాద్రి, అధికారులు, మెడికల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్య సేవ‌లు
బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. గత పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. ఏ గ్రామానికి వెళ్లినా మౌలిక వసతులపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నా యని చెప్పారు. మౌలిక వ‌స‌తులు క‌ల్ప‌న‌కు నిధులు మంజూరు చేయిస్తానని, తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం తో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాల న్నారు . రోగులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement