Wednesday, November 27, 2024

TG – మాజీ ఎమ్మెల్యే చిట్టెం సహా బిఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు

మక్తల్ , నవంబర్ 27(ఆంధ్రప్రభ)నారాయణ పేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఇవాళ బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తారన్న సమాచారంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సహా బిఆర్ఎస్ నేతలను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసి నారాయణపేట జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.

తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి తో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్, సీనియర్ నాయకుడు రాజుల ఆశిరెడ్డి సహా మక్తల్ మాగనూరు మండలాలలోని పలువురు బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో తరలించారు.

మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని జిల్లాలోని మద్దూర్ పోలీస్ స్టేషన్ కు తరలించగా మాజీ మార్కెట్ చైర్మన్ పి.నర్సింహ గౌడ్ ,సీనియర్ నేత రాజుల ఆశిరెడ్డిని నర్వ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఎలాంటి ఆందోళన నలు జరగకుండా మాగనూర్ మండల కేంద్రంలో డిఎస్పి లింగ ఆధ్వర్యంలో భారీ పోలీసు బంధుబస్తు ఏర్పాటు చేశారు .పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ఖండించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement