Saturday, September 21, 2024

TG | గోదావరి ముంపు వాసులకు శాశ్వత పరిష్కారానికి కృషి…

బూర్గంపాడు (ప్రభ న్యూస్): ప్రతి ఏడాది గోదావరి వరదల వల్ల తీవ్రంగా నష్టపోతున్న మండల కేంద్రమైన బూర్గంపాడులోని ముంపు వాసులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం సాయంత్రం బూర్గంపాడులోని గోదావరి ముంపు ప్రాంతాలైన అంబేద్కర్ కాలనీ, కొల్లు, వీరబ్రహ్మం కాలనీలోని పలు ప్రాంతాలను ఎమ్మె ల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ కాలనీ లోని గోదావరి వరద ముంపుకు గురైన ప్రాంతాలను ఆయన పరిశీలించి స్థానికులతో మాట్లాడారు… గోదావ రి వరదల వల్ల ప్రతి సంవత్సరం తాము అనేక విధాలు గా నష్టపోతున్నామని, ఈ ప్రాంతం ముంపుకు గురవు తుందని, తామను ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని.. అనేక ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం దొరకటం లేదని.. మీరే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేకు స్థానికులు మొరపెట్టుకున్నారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బూర్గంపాడులో గోదావరి వరద ముం పు గురయ్యే ప్రాంతాలపై తనకు అవగాహన ఉందని ఆయన అన్నారు. గోదావరి వరదల వల్ల నష్టపోతున్న పేదలు ముంపుళ గోదారి వరదలు నష్టపోతున్న పేదలు ముంపు ప్రాంతాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లితేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆయన అన్నారు.

దీంతో ఏకీభవించిన ప్రజలు తాము ఈ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్తామని మైదాన ప్రాంతాలలో తామకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే తామందరూ వెళ్లడానికి సిద్ధమేనని ప్రజలు పేర్కొన్నారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గోదావరి వరద ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తాను సీఎం రేవంత్ రెడ్డితో, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని ఆయన హామీ ఇచ్చారు.

అదేవిధంగా ఇక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ ఇళ్ల స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.

- Advertisement -

త్వరలోనే బూర్గంపాడులోని గోదావరి వరద ముంపు గురి అయ్యే ప్రాంతాల లిస్టులు తయా రుచేసి, ఆ లిస్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం దృష్టికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశ చరిత్రలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు తహశీల్దార్ ముజాహిద్, ఎం పి ఓ పవన్, ఎస్సై రాజేష్,గ్రామపంచాయతీ ఈవో సమ్మయ్య, మాజీ ఎంపీపీ కైపు రోషి రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ టీసీ, బూర్గంపాడు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందా నాగరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భజన సతీష్, భజన ప్రసాద్, మహిళా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షురాలు బర్ల నాగమణి, మాజీ ఉప సర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి,దాసరి సాంబ, చిప్పా రాజు బూత్ కన్వీనర్ అలవాల దుర్గాప్రసాద్, కోకన్వీనర్ నందిపాటి పండు, నాయకులు ఇసంపల్లి సురేష్, కేసు పాక సీతారాంబాబు, గోడ్ల వెంకటేశ్వర్లు, కేసుపాక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement