Sunday, November 17, 2024

TG – పొన్నంకు ఈట‌ల కౌంట‌ర్ – మూసిలో ప‌ర్య‌టిద్దాం ర‌మ్మంటు ఆహ్వానం

ఎవ‌రివి డ్రామాలే అక్క‌డే ప్ర‌జ‌లు తెలుస్తారంటూ కామెంట్
పేద ప్రజలను కాపాడుకునేందుకు బుల్డ‌జ‌ర్ల‌కు అడ్డుప‌డ‌తాం

హైదరాబాద్ – మూసీ ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ పార్టీవి డ్రామాలే అయితే తాను రాజకీయాలను మానేస్తానని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్తీ నిద్రలో భాగంగా శనివారం రాత్రి ఆయన ఎల్‌బీ నగర్ లోని మూసీ పరివాహక ప్రాంతంలోని ఓ ఇంట్లో నిద్రించారు. అనంతరం ఇవాళ ఉదయం ఆయన బస్తీవాసులతో మాట్లాడారు. ఇక్క‌డ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, మూసీ ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. బీజేపీ వి డ్రామాలు అని కామెంట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాక కు ఆయన కౌంటర్ ఇచ్చారు. బీజేపీ వి డ్రామాలే అయితే మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిద్దామని.. అక్కడి ప్రజలు తమవి డ్రామలని అంటే రాజకీయాలు మానేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ప్రభుత్వానివే డ్రామాలని వాళ్లు చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీల ధోరణి ఒక్కటేనని ఆరోపించారు. రూ.లక్షలు పోసి కట్టుకున్న నిరుపేదల ఇళ్లను కూలగొడతామంటే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. కూల్చివేతలకు ఎన్ని బుల్డోజర్లు వచ్చినా అడ్డుకుని తీరుతామని అన్నారు.

బుల్డ‌జ‌ర్ల‌కు అడ్డుప‌డ‌తాం – ల‌క్ష్మ‌ణ్

మూసీ నివాసితులకు భరోసాగా బీజేపీ ఉంటుందని బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ మూసి నిద్రలో భాగంగా మలక్ పేట శాలివాహన నగర్ లో నిద్ర చేశారు. అనంతరం నేటి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తం అవ్వాలన్నారు. కాదని పేదలతో చెలగాటం ఆడితే మాత్రం ఉపేక్షించేది లేదన్నారు. మూసీ నివాసితుల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తే.. బుల్డోజర్ లకు అడ్డం నిలబడుతామన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయన్నారు. మూసీ నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాంట్రాక్టర్ల జేబులు నింపే మార్గాలు అన్వేషిస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఈ మూసి ప్రక్షాళన అని తెలిపారు.

- Advertisement -

మూసీ ప్ర‌క్షాళ‌న‌కు వ్య‌తిరేకం కాము..

మూసీ ప్రక్షాళన కు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మూసీ శుద్ధీకరణ చేయాలి.. పరిశుద్దంతో ప్రవహించి నల్గొండ, భాగ్యనగర్ ప్రజలకు ఉపశమనం కల్గించాలన్నారు. అందుకు అనేకమైన మార్గాలు ఉన్నప్పట్టికీ.. లక్షా యాభై వేల కోట్లతో మూసీ శుద్ధీకరణ అంటున్నారని తెలిపారు. వారసత్వంగా మూసీ నివాసితులు ఇక్కడ నివసిస్తున్నారని గుర్తుచేశారు. మూసీకి ఇరువైపులా గోడలు నిర్మించి.., ఎస్టీపీ లు ఏర్పాటు చేసి, డ్రైనేజీ వ్యవస్థను మార్చే అవకాశం ఉందన్నారు. కానీ పేదల ఇండ్లు బుల్డోజర్ల తో కూల్చి వేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు అహంకార పూరితంగా మాట్లాడడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. మీ ప్రతాపం పేదల మీదనా అని ప్రశ్నిస్తే.. బీజేపీ నీ కూడా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన గ్యారెంటీల విషయంలో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అక్కడి మంత్రులే బాహాటంగా విమర్శిస్తున్నారని తెలిపారు.

ఏం సాధించారని విజయోత్సవాలు..

కర్ణాటక దీన స్థితి చూసి.. హామీలు ఇచ్చి ముందు ఒకటికి రెండుసార్లు అలోంచాలని స్వయంగా ఖర్గేనే అంటున్నాడని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది.. ఇప్పుడు విజయోత్సవాలు చేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేనికోసం ఈ విజయోత్సవాలు.. ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారు. అని ప్రశ్నించారు. రైతులను నమ్మించి నట్టేట ముంచినందుకు విజయోత్సవాలు జరుపుతారా? అని మండిపడ్డారు. రైతులకు భరోసా పేరు పై 15 ఇస్తామన్నారు ఇవ్వలేదన్నారు. కౌలు రైతులకు, కూలీలకు వర్తింపజేస్తామన్నారన్నారు. కానీ ఒక్క రైతుకు కూడా భరోసా ఇవ్వలేకపోయారన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని మోది 6 వేల రూపాయలు ఇస్తున్నారనిఅన్నారు. కాని ఇక్క‌డ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోడు వింటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నారు. ఆరుగాలం కష్టపడి పండిస్తే నెలల తరబడి కొనుగోలు చేసే దిక్కు లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement