శంకరపట్నం, డిసెంబర్ 28 (ఆంధ్రప్రభ): రెవెన్యూ శాఖలో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల డిప్యూటీ తహశీల్దార్ మల్లేశం రూ. 6వేల లంచం తీసుకుంటు-ండగా శనివారం ఏసీబీ అధికారులు వల పన్ని పట్టు-కున్నారు. ఓ వ్యక్తి దగ్గర నుంచి నాలా కన్వర్షన్ కోసం అనుమతులు కోరగా, డీటీ మల్లేశం లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు చేసేది ఏమీ లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం ఏసీబీ డీఎస్‌పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు డిప్యూటీ తహసిల్దార్ మల్లేశం లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్ గా పట్టు-కున్నారు. డీటీని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
TG – ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప – లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్
Advertisement
తాజా వార్తలు
Advertisement