Friday, November 15, 2024

TG – ఆరోగ్య‌శ్రీకి రేష‌న్ కార్డ్ లింక్ వ‌ద్దు – ఆదేశాలు జారీ చేసిన రేవంత్

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ … హైద‌రాబాద్ – రేషన్ కార్డుకు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దని ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నేడు క‌లెక్ట‌ర్ల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు.. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని తెలిపారు. రాష్ట్రంలో ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. ఇందుకు సంబంధించి అధ్యయనం చేసి కొత్త జీవో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు.

ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. రూరల్ ఏరియాలో పనిచేసే వైద్యులకు పారితోషికం ఎక్కువ అందించి ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతీ బెడ్ కు ఒక సీరియల్ నెంబర్ ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడాలని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement