హదరాబాద్ – తెలంగాణలోని మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు కోరారు. హైదరాబాద్ లోని మున్సిపల్ చాంబర్స్ కార్యాలయంలో నేడు కార్యవర్గ సమావేశం జరిగింది.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చైర్మన్ మేయర్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల మేరుగైన అభివృద్ధిని సమర్ధంగా విధులు నిర్వహంచే అవకాశం ఉందని తెలిపారు. రాజీవ్ గాంధీ,స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే సంకల్పంతో 73,74వ రాజ్యాంగ సవరణ చేస్తే దానిక తూట్లు పోడిచే విధంగా గతంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం పురపాలక, పంచాయతీ రాజ్ నూతన చట్టాలను తీసుకువచ్చి స్థానిక సంస్థలను నిర్విర్యం చేసిందని విమర్శించారు.
చట్ట సవరణ వల్ల స్థానిక సంస్థలు నిర్విర్యం అయి పాలకవర్గాలు ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అధికారాలను ప్రభుత్వ అధికారులకు అప్పగించి పాలక వర్గాలపై ఆజాయాయిషి చేసే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విఫలమై భవిష్యత్లో ద్వీతియ శ్రేణి నాయకత్వం రాకుండా పోయే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నా పురపాలక చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు.
నిధులు విడుదల – రేవంత్ కు ధన్యవాదాలు …
తెలంగాణ చరిత్రలో గత ప్రభుత్వ విధానాల వల్ల పురపాలికలు చితికి పోయాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత పదకొండు ఎండ్లుగా పేరుకుపోయిన టిడిఎస్ ను సుమారు రూ.2700,కోట్ల విడుదల చేసి ప్రజాపాలనకు దిక్సూచిగా నిలిచారని అన్నారు. ఈ నిధుల విదుదల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తు సిఎం కృతజ్ఞతలు తెలియజేశారు ఇట్టి నిధులను తక్షణం అభివృద్ధికి వెచ్చించే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ నిధులు రాష్ట్ర ఖజానా ద్వారా కాకుండా మున్సిపల్ సాధరణ నిధుల కింద ఖర్చు చేసే వేసులుబాటు కల్పించాలని సిఎం రేవంత్ రెడ్డిని కోరారు.
పన్నుల వేసే అధికారం…..
పట్టణ ప్రగతి నిధులు 20నెలలుగా విడుదల కాకపోవడం వల్ల వాటిని ఆధారంగా చేసుకోని చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించడంలో ఇబ్బందు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు విధించే అధికారం ఒకే విధంగా ఉండకుండా పన్నులను ఖరారు చేసే అధికారాలు స్థానిక సంస్థలకు ఇవ్వాలని సీఎం ను కోరారు. విలేకరుల సమావేశంలో చాంబర్స్ ప్రతినిధులు అల్లపల్లి నరసింహ, శాగంటి అనసూయ తదితరులు పాల్గోన్నారు.