గోదావరిఖని, ఆంధ్రప్రభ సైకిల్ తో ఉల్లాసం తో పాటు ఆరోగ్యం మెరుగవుతుందని గోదావరిఖని ఏసిపి మడత రమేష్ తెలియజేశారు. ఆదివారం గోదావరిఖని సబ్ డివిజన్ అధికారులతో కలిసి సైక్లింగ్ చేశారు.
అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు నిత్య వ్యాయామం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రతిరోజు నడక, వ్యాయామం, సైక్లింగ్, స్విమ్మింగ్ లో ఏదో ఒకటి చేయడం వల్ల శారీరక దారుణ్యం పెంపొందుతుందన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ శారీరక శ్రమ అలవాటు చేసుకుంటే మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.