Friday, January 10, 2025

TG సైబ‌ర్ నేర‌గాళ్ల‌పై పోలీసుల నిఘా – 23 మంది అరెస్ట్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సైబ‌ర్ నేర‌గాళ్ల ఆగ‌డాల‌కు తెలంగాణ పోలీసులు చెక్ పెడుతున్నారు. దేశ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు సులువుగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెగబడుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం‌లలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నిలువునా దోచేస్తున్నారు. క్యూఆర్ కోడ్స్ , వెబ్ లింకులతో అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. కొరియర్ల పేరిట డిజిటల్ అరెస్టులు అంటూ బ్యాంక్ ఖాతాల్లోని డబ్బునంతా ఖాళీ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లు , ట్రేడింగ్‌ లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభం వస్తుందని నమ్మించి ముంచేస్తున్నారు. ఈ క్ర‌మంలో అలాంటి వారిపై తెలంగాణ పోలీసులు నిఘా వేశారు.

23 మంది అరెస్టు
సైబర్ క్రైమ్ కేసుల్లో కీలక నిందితులుగా ఉన్న వారిని పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ , కర్ణాటక , ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌ లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 23 మంది సైబర్ నేరగాళ్లను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై దేశ వ్యాప్తంగా 328 కేసులు, తెలంగాణలో 30 కేసుల్లో కీలక నిందితులుగా ఉన్నట్లుగా తేలింది. ఈ మేరకు నిందితుల నుంచి సెల్‌ఫోన్లు , చెక్‌ బుక్స్, సిమ్ కార్డు లను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement