హైదరాబాద్: యాకుత్‌పురాలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన బాణసంచాకు మంటలు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ దంపతులు ఉషారాణి, మోహన్‌లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
వారి 18 సంవత్సరాల కుమార్తె మలక్‌పేట్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.బాణసంచా దుకాణం నిర్వహిస్తున్న దంపతులు.. దుకాణం మూసి వేయగానే వాటిని ఇంట్లో నిల్వ ఉంచారు. ఇంట్లో పిండి వంటలు చేస్తున్న సమయంలో వాటికి నిప్పు అంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. .