Thursday, November 28, 2024

TG – ఫుడ్ పాయిజ‌న్ లో కుట్ర‌కోణం – నిగ్గు తేలుస్తామంటున్న మంత్రి సీత‌క్క

త్వ‌ర‌లోనే నిజాలు వెలుగులోకి వ‌స్తాయ‌న్న మంత్రి
అధికారులుంటే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటాం
రాజ‌కీయ‌నేత‌లుంటే అరెస్ట్ చేస్తాం..
ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ అనుమ‌తి పాపం బిఆర్ఎస్ దే
అప్పుడేమో అనుమ‌తులిచ్చి ఇప్పుడోమో ఆందోళ‌న‌లు చేస్తున్నారు

హైదరాబాద్ – రాష్ట్రంలో వరుసగా వెలుగుచూస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక భారీ కుట్ర కోణం ఉందని మంత్రి సీతక్క అన్నారు. నేడు స‌చివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కుట్ర వెనక ఎవరున్నారు అనేది త్వ‌ర‌లో బయట పెడతామ‌ని చెప్పారు. కుట్ర దారులు వెనక అధికారులు ఉంటే ఉద్యోగాలు తీసేస్తామ‌న్నారు. రాజకీయ పార్టీ నేత‌ల కుట్ర ఉందని త‌మ‌కు అనుమాన ఉంద‌ని అన్నారు సీత‌క్క‌. విచార‌ణ‌లో వారి భాగ‌స్వామ్యం ఉంద‌ని తేలిస్తే అరెస్ట్ లు త‌ప్ప‌వ‌న్నారు..

ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ‌కు అనుమతి ఇచ్చింది బిఆర్ ఎస్ పార్టీనే
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్‌లో పరిశ్రమకు అనుమతి ఇచ్చిందే బీఆర్ఎస్ అని సీత‌క్క చెప్పారు.. బీఆర్ఎస్, బీజేపీలు ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా 2023 అనుమతి ఇచ్చాయ‌ని ఆరోపించారు.. కడప వాళ్లకు కంపెనీకి ఇచ్చింది కెటిఆర్ న‌ని అంటూ అన్నీ వివరాలు త్వరలో బయటపెడతాం’ అని స్పష్టంచేశారు. ఈ ప‌రిశ్ర‌మ ఏర్పాటుపై కేటీఆర్ నిస్సిగ్గుగా త‌మపై నిందలు వేస్తున్నార‌ని మండిప‌డ్డారు .

- Advertisement -

కంపెనీ డైరెక్టర్‌గా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ త‌న‌యుడు తలసాని సాయి కిరణ్ వ్యవహరించార‌న్నారు. ఈ ఫ్యాక్టరీలో తలసాని వియ్యకుండు మరో భాగస్వామిగా ఉన్నాడ‌న్నారు.. ఎక్కడెక్కడో తిరుగుడు ఎందుకు అంటూ కెటిఆర్ ను ప్ర‌శ్నించారు సీత‌క్క‌. దిలావర్ పూర్ రండి.. ప్ర‌జ‌ల మ‌ధ్య తేల్చుకుందాం ర‌మ్మంటూ కెటిఆర్ కు స‌వాల్ విసిరారు.. .చిల్లర రాజకీయాలు డ్రామాలు ఆప‌డంటూ హిత‌వు ప‌లికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement