Tuesday, January 7, 2025

TG – గుండె కోతగా రైతు భరోసా – ఇది కాంగ్రెస్ నయ వంచన : హరీశ్ రావు

హైదరాబాద్ : రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.15,000 ఇస్తామని ఆశలు పెట్టి ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.

ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ”ఇప్పుడైతే 10 వేలు, మాకు ఓటేస్తే 15వేలు ఇస్తం” అని ఊరించిండని తెలిపారు. అప్పుడు నమ్మించి ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారని ఆరోపించారు. ఇప్పుడు గద్దల్లాగా మారి రైతులను దారుణంగా వంచిస్తున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు.

కేబినెట్ నిర్ణయంతో రైతుల ఆశలను అడియాసలు చేసిందని.. రైతు భరోసాను రైతు గుండెకోతగా మార్చారన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పి.. రూ.6 వేలకు కుదించారని విమర్శించారు. వాన కాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితోపాటు కలిపి ఎకరానికి రూ.15 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

రుణమాఫీ సగం మందికి ఎగ్గొట్టడం ద్వారా అదొక చిల్లర నాటకంగా మార్చేశారని.. బోనస్ ఇస్తామన్న హామీ ఉత్త బోగస్గానే మిగిలిపోయిందని మండిపడ్డారు. పంటల బీమా పత్తా లేకుండా పోయిందని హరీశ్ రావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement