Monday, January 20, 2025

TG – మార్చి నుంచి నైని బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తి … డిప్యూటీ సీఎం భట్టి


గత జులై 24న జరిగిన చర్చలు ఫలించాయి
విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు ప్లాన్​
అక్కడే 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు
అవసరమైన స్థలాన్ని కేటాయించాలని ఒడిశాకు ర్వికెస్టు
ఒడిశా సీఎం మాంజిని కోరిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్​, ఆంధ్రప్రభ: నైని గనులతో ఈ మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఒడిశా రాష్ట్రంలోని కోణార్క్​లో జరుగుతున్న మూడో జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సు సందర్భంగా సీఎం మోహన్ చరణ్ మాంజీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ లేఖను ఆయనకు అందజేశారు. ఒడిశా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో నైని బొగ్గు గనిని స్థాపించేందుకు సీఎం కార్యాలయం నుంచి అద్భుతమైన మద్దతు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సరం జులై 24న జరిగిన సమావేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని, ఆ చర్చలు ఫలవంతం అయ్యాయని తెలిపారు.

- Advertisement -

అక్కడే పవర్​ ప్లాంట్​ ఏర్పాటు..

నైని క్యాప్టివ్ బ్లాక్ అయినందున బొగ్గు గని నుంచి ఉత్పత్తి చేసిన బొగ్గును తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 800 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు సరఫరా చేయనున్నారు. జైపూర్ విద్యుత్ ప్లాంట్ నైనీ గని నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది, లాజిస్టిక్స్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి ఒడిశాలోని నైనా బొగ్గు గని సమీపంలో పిట్ హెడ్ ఓవర్ ప్లాంట్ గా 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది, దీంతో ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు, బొగ్గు లాభదాయకంగా ఉపయోగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని ఒడిశా సీఎంకు అందించిన లేఖలో ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement