Monday, December 23, 2024

TG – సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాం – ఫిల్మ్ ఎగ్జిబిట‌ర్ల అసోసియేష‌న్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియర్, బెన్ ఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించార‌ని, అలాగే టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్ర‌క‌టించింది. సోమ‌వారం తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స‌మావేశం జ‌రిగింది.

ఏపీలో కూడా ఇదే నిర్ణ‌యం తీసుకోవాలి….
ఈ సందర్భంగా తెలంగాణా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సింగిల్ స్క్రీన్స్కు ఊపిరి పోసేలా ఉందని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సీఎం, సినిమాటోగ్రఫీ మినిస్టర్కు కృతజ్ఞతలు చెప్పారు. సామాన్యులకు టికెట్‌ ధరలు అందుబాటులో ఉండాలని, టికెట్ ధరల పెంపు వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటేనే ప్రజలు, ప్రేక్షకులు సినిమా చూడాటిని వస్తారని అన్నారు.

తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాంప్రసాద్ మాట్లాడుతూ.. కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీశామని ఎక్కువ రేట్లు పెడుతున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు, థియేటర్ వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రాలోనూ అమలు అవ్వాలని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -


తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ మాట్లాడుతూ.. ఆడియన్స్కి టికెట్ రేటు ఎంత ఉందో కూడా తెలియనంత అయోమయంలో ఉన్నారు. తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రేట్లు పెరగడం వల్ల పెద్ద సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దీంతో చిన్న సినిమాకు డబ్బులు ఉండడం లేదు అని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement