హైదరాబాద్ – విశ్వంభర మూవీ షూటింగ్ లో ఉన్న మెగా స్టార్ చిరంజీవికి అల్లు అర్జున్ అరెస్ట్ వార్త తెలిసింది..వెంటనే ఆయన తన షూటింగ్ ను రద్దు చేసుకున్నారు.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన ఆయన సతీమణి సురేఖకు తీసుకుని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు.. అర్జున్ సతీమణి స్నేహారెడ్డితో వారు మాట్లాడారు.. జరిగిన విషయాలను ఆమె ద్వారా అడిగి తెలుసుకున్నారు.. అనంతరం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు బయలు దేరారు.. అక్కడ నుంచి నాంపల్లి కోర్టుకు వెళ్ళనున్నారు చిరంజీవి.