ఆంధ్రప్రభ , చర్లపల్లి (హైదరాబాద్) : ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణలో కనెక్టివిటీ వేగవంతానికి అనేక చర్యలు తీసుకుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైల్వేలకు జరిగిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వేగవంతంగా పూడ్చే పనిలో ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగానే చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, యాదాద్రి మెట్రోలైన్, కొమురవెల్లికి ప్రత్యేక రైల్వే స్టేషన్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పచ్చజెండా ఉపారని కేంద్రమంత్రి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ రోజు మంత్రి జి.కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించి జరిగిన పనులపై అధికారులతో ఆరా తీశారు. స్టేషన్ మొత్తం కలియదిరిగి ఏ మేరకు పనులు జరిగాయి? ఇంకా ఏ మేరకు జరగాల్సి ఉంది? అనే విషయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. చరపల్లి టెర్మినల్ పునర్ నిర్మాణానికి రూ. 430 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ప్రస్తుతం 98 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. వచ్చె నెలఖరు వరకు ప్రయాణికులకు ఈ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టంలోని మౌలిక వసతుల అభివృద్దఙపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. జాతీయ రహదారులు, విశ్వవిద్యాలయాలు, అత్యంత వేగవంతంగా రైల్వేల అభివృద్ధిని చేపడుతుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైల్వేలకు చాలా అన్యాయం జరిగిందన్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకునే మిషన్ మోడ్ లో కేంద్రం రైల్వే అభివృద్ధిని చేపట్టిందన్నారు. అన్ని రైల్వే లైన్లను ఎలక్ర్టిఫికేషన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. తెలంగాణకు హైదరాబాద్ రాజధానిలో మూడు మేజర్ టెర్మినల్ లు ఉన్నాయన్నారు.
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి టెర్మినల్ లకు అదనంగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అందుబాటులోకి రాబోతుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.ఈ టెర్మినల్ అందుబాటులో వస్తే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లిలపై భారం తగ్గుతుందన్నారు.
ఓఆర్ ఆర్ ద్వారా చర్లపల్లికి త్వరగా చేరుకోవచ్చన్నారు. . పీఎం నేతృత్వంలో మోనిటరింగ్ చేసి 98 శాతం పనులు పూర్తి చేశామన్నారు. ఒక నెలలోనే మిగతా పనులు పూర్తి చేసి ప్రయాణికులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే యోచనలో ఉన్నామన్నారు. ఈ డ్యూయల్ రైల్వే టెర్మినల్ కు రూ. 430 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. ఇక్కడ 20 రైళ్లు ఆగుతాయన్నారు. .
హైదరాబాద్ కు వచ్చే గూడ్స్ రైళ్లు కూడా చర్లపల్లిలో ఆగుతాయన్నారు. ఇక్కడి నుంచే అన్ లోడ్, పార్కింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. చర్లపల్లి స్టేషన్ ను పూర్తి అత్యాధునిక హంగులతో నిర్మాణం చేశామన్నారు. వెయిటింగ్ రూమ్, రెస్ట్ రూమ్, ఎస్కలేటర్లు, లిఫ్టులు, దివ్యాంగులు, వృద్దులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇక్కడి నుంచి నగరానికి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డును రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటికే రైల్వేశాఖ జీఎం రాష్ర్ట ప్రభుత్వానికి లేఖలు రాశారని, తాను కూడా స్వయంగా రోడ్ల కనెక్టివిటీని మెరుగుపరచాలని సీఎంను అడిగానని అన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
భరత్ నగర్ వైపు 80 అడుగుల రోడ్డు, మహాలక్ష్మి వైపు 80 అడుగుల రోడ్డు, ఇండ్రస్టీయల్ వైపు 100 ఫీట్ల రోడ్లు ఉండాలని కోరినట్లు తెలిపారు. త్వరలో ఈ కనెక్టివిటీని రాష్ర్ట ప్రభువం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చయాల్సి అవసరం ఉందన్నారు.
గతంలో బీఆర్ఎస్ కేసీర్ కు కూడా లేఖలు రాసినా స్పందించలేదరన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశానని తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం కూడా వేగవంతంగా ఆయా పనులు చేస్తామని తమకు తెలిపిందన్నారు.
మరోసారి ఈ పనుల కోసం మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. కనెక్టివిటీ సులువైతేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. త్వరలోనే రైల్వే, ప్రభుత్వ అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
ఈ రైల్వే స్టేషన్ నిర్మాణంలో పర్యావరణ హిత చర్యలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ వ్యవస్థను పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మాణం చేస్తున్నామన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించామని సక్సెస్ ఫుల్ గా వాటి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.
తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కవచ్ కు సంబంధించిన పనులు జరగడం పట్ల ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్ నుంచే ఐదు వందేభారత్ ట్రైన్లు వస్తాయన్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెంచుతామన్నారు. ఈ రకమైన రైళ్లలో స్లీపర్ కోచ్ లను కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అమృత్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్కృతికి ప్రతిబింబించేలా ఆధునికతతో కూడుకున్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ రూ. 715 కోట్లు, నాంపల్లి రూ. 429 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఆ పనులను పరిశీలిస్తానని అన్నారు. దక్షిణ భారత్ లో ఆధునిక సాంకేతికత, వసతులతో కూడిన రైల్వే స్టేషన్ గా సికింద్రాబాద్ నిలవబోతుందని డిసెంబర్ 2025లోపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని అన్నారు.
సికింద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మాదిరిగా రూపొందుతుందన్నారు. నాంపల్లి పనులపై టెండర్లు పూర్తవుతాయని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఇక్కడ రైల్వే వ్యాగన్స్ ఇక్కడే తయారవుతాయన్నారు.
తెలంగాణలో 346 కి.మీ. కొత్త రైల్వే లైన్లను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయని అన్నారు. 369 కి.మీ. సింగిల్, డబ్లింగ్, ట్రిపులింగ్ లు చేపట్టామన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.
త్వరలోనే నిర్మాణ పనులు మొదలు పెడతామన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ పనులు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. భక్తులకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి కొమురవెల్లి మల్లన్నకు కూడా ప్రధాని మోదీ రైల్వే స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
ఆ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ లు ప్రమాదకరంగా ఉండకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 268 ఆర్ యూబీలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలు, 42 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మాణం పూర్తి చేశామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రయాణికుల భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు తెలంగాణలో 176 రైల్వే స్టేషన్ లలో హై స్పీడ్ వైఫై సౌకర్యాన్ని కల్పించామని అన్నారు.
వివిధ రైల్వే స్టేషన్ లలో 86 స్టాల్స్ స్థానిక ఉత్పత్తులను ఏర్పాటు చేశామన్నారు. చర్లపల్లి లో సివరేజీ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. 500 చెట్లను రీ లొకేషన్ చేశామన్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా 5500వేల చెట్లను నాటాలని నిర్ణయించామన్నారు. గ్రీనరికి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ స్టేషన్లలో 3000 మొక్కలను నాటామన్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా ఆధునిక పద్దతులతో ఏర్పాటు చేశామన్నారు.
రానున్న రోజుల్లో ఎలక్ర్టిక్ చార్జీంగ్ 12 పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సోలార్ పవర్ 110 కిలోవాట్స్ తో ఏర్పాటు చేశామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందశాతం సోలార్ పవార్ విద్యుత్ ను వినియోగించుకునే ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
చర్లపల్లి కొత్త రైల్వే టెర్మినల్ నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం చర్లపల్లి టెర్మినల్ పనులను పరిశీలించారు. ₹430 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో కొత్త టెర్మినల్ నిర్మిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకున్న కొత్త టెర్మినల్ను త్వరలో ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు.వందేభారత్ లో స్లీపర్ కోచ్ లు చర్లపల్లి నుంచి నగరంలోకి రోడ్ కనెక్టివిటీ పెంచాల్సి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ యుద్ధ ప్రాతిపాదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. వందేభారత్ ట్రైన్లలో స్లీపర్ కోచ్ లు ప్రారంభిస్తామని, హైదరాబాద్ నుంచి నడిచే వందేభారత్ రైళ్లలోనే స్లీపర్ కోచ్ లు ప్రవేశ పెడతామని తెలిపారు. రాష్ట్రానికి మూడు మేజర్ టెర్మినల్స్ ఉన్నాయన్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ను పొడిగించాలని ప్రయత్నిస్తానని కిషన్ రెడ్డి చెప్పారు.