Tuesday, November 5, 2024

TG – రాహుల్ గాంధీ ఆలోచ‌నా స్పూర్తితోనే కుల‌గ‌ణ‌న – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

హైద‌రాబాద్ – కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రియనేత రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేసిన స‌మ‌యంలో దేశంలోని వనరులు, సంపద సమాన స్థాయిలో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కుల గణన జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుందని గుర్తించారని అన్నారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌..

ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కుల గ‌ణ‌న చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.. దీనికి అనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు యావత్ క్యాబినెట్ ఈ అంశంపై పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు . కుల గణనపై శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేయించి… ఆ తర్వాత తీర్మానాన్ని జీవో గా మార్చి.. ప్రణాళికా శాఖ ద్వారా సమాజం ముందు పెట్టామని తెలిపారు.

కుల గణన సర్వేలో సమాజంలోని అన్ని వర్గాలను పొందుపరచాల‌ని, అందుకు వారిని ఏ ప్రశ్నలు అడగాలి, ఈ సమాచారం సేకరించాలి వంటి అంశాలు తెలుసుకునేందుకు నేడు రాహుల్ గాంధీ తెలంగాణ సమాజంలోని మేధావులు, సామాజికవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.

- Advertisement -

కుల గణన అంశంపై గాంధీభవన్లో ఇప్పటికే కీలక నేతలతో సమాలోచనలు జరిపామ‌ని చెప్పారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీలు సమావేశమై సమాచారం సేకరించారని తెలిపారు . ఈ ప్రక్రియలో భాగంగా మేధావులను పిలిచి వారి సలహాలు సూచనలు తీసుకొని, రాహుల్ గాంధీ ఆలోచనలు తెలుసుకొని కుల గణన సర్వేలో ప్రశ్నలు పొందుపరిచి సమగ్ర సమాచారం సేకరిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement