నాగదేవత ఆలయంలో చోరీకి నిరసనగా హర్తాళ్
పట్టణంలో భారీగా పోలీసుల మోహరింపు
స్వచ్చందంగా మూత పడ్డ వాణిజ్య సముదాయాలు.
నిర్మల్ జిల్లా భైంసాలో బంద్ కొనసాగుతోంది. నాగదేవత ఆలయంలో చోరీకి నిరసనగా హిందూ వాహిని ఇచ్చిన పిలుపు మేరకు దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కాగా, భైంసా పట్టణ శివారులోని నాందేడ్ వెళ్లే మార్గంలో ఉన్న నాగదేవత ఆలయంలో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయ మెయిన్ గేటు తాళాన్ని పగులగొట్టి హుండీలోని కానుకలను దోచుకెళ్తారు. ఉదయం 9 గంటలకు స్థానికులు ఆలయానికి వెళ్లినప్పుడు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అలాగే నాగదేవత ఆలయంతో పాటు ఇటీవల భైంసా పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం, నరసింహ స్వామి ఆలయం, పంచముఖి హనుమాన్ ఆలయాల్లో వరుసగా చోరీలు జరగడం ఆందోళన కలిగించాయి. కాగా, భైంసా పరిసరాల్లోని ఆలయాల్లో వరుస చోరీలు జరుగుతున్నా పోలీసులు అరికట్టకపోవడంపై హిందూవాహిని ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చోరీలను నిరసిస్తూ నేడు బంద్కు పిలుపునిచ్చారు. బంద్ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు.. ఇక స్వచ్చందంగా పట్టణంలోని వాణిజ్య సంస్థలను మూసివేశారు.