Friday, November 22, 2024

TG Budget – ఇది పూర్తి మోసపు బ‌డ్జేట్టే….కెసిఆర్

ప్ర‌జ‌ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన భ‌ట్టి
రైతుల‌కు ఈ బ‌డ్జెట్ వెన్నుపోటే
రుణ‌మాఫీ, రైతు భ‌రోసాల‌పై ఆంక్ష‌లు వ‌ల‌యం
ఒక్క కొత్త ప‌థ‌క‌మైనా ఈ బ‌డ్జెట్ లో ఉందా
వాస్త‌వాల‌కు దూరంగా కాంగ్రెస్ బ‌డ్జెట్
అంతా ట్రాష్, గ్యాస్..
ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం
అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద కెసిఆర్ వ్యాఖ్యలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ఈ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందంటూ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. నేడు జ‌రిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు… అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర రైతులను ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. రైతు భరోసాలో ఆంక్షలు పెట్టపోతున్నట్లు చెప్పి వారి మోసాన్ని బయటపెట్టారన్నారు. ఒక్క పథకంపై కూడా స్పష్టత లేదని ధ్వజమెత్తారు. యాదవుల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన గొర్రెల పెంపకం పథకాన్ని మూసివేసినట్లుగా అర్థం అవుతోందన్నారు. దళితబంధు పథకం ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. మత్స్యకారులకు కూడా భరోసాలేదన్నారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం కూడా తేలేదన్నారు. మహిళలకు లక్షకోట్లు ఇస్తున్నట్లు అబద్ధాలు చెప్పారన్నారు. రుణాలను కూడా వాళ్లు ఏదో ఇస్తున్నట్లు చెప్పారని ఆరోపించారు.

- Advertisement -

రైతులకు తాము ఇచ్చిన డబ్బులను ఏదో ఆగం చేశామని దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. రైతులను, వృత్తి కార్మికులను ప్రభుత్వం వంచించిందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలు ఏంటనే అంశాలపై ప్రకటన లేదన్నారు. చిల్లర మల్లర ప్లాట్ ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్పా.. బడ్జెట్ ప్రసంగంలా లేదన్నారు. ప్రభుత్వం తమ లక్ష్యం, టార్గెట్ ఏంటో చెప్పలేదన్నారు. ఇది పేదల, రైతుల‌తో స‌హా ఎవరి బడ్జెట్ కాదన్నారు. భవిష్యత్ లో ఈ అంశంపై చీల్చిచెండాడుతామన్నారు.

బడ్జెట్ లో రైతు భరోసా ప్రస్తావనే లేదు. రైతులను పొగిడినట్లే పొగిడి వెన్నుపోటు పొడిచార‌న్నారు. ఈ బడ్జెట్ లో అన్ని వర్గాలకు నిరాశే మిగిల్చింద‌న్నారు కెసిఆర్.. ఆర్థిక మంత్రి వొత్తి వొత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీ లేద‌న్నారు. ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని అనుకున్నామ‌ని, అయితే వారు మాత్రం ఆ లోప‌లే అన్ని అబ‌ద్దాలు చెబుతూ కాల‌క్షేపం చేయ‌డంతోనే తామ నోరు విప్పాల్సి వ‌చ్చింద‌న్నారు.. బడ్జెట్ వాస్తవానికి చాలా దూరంగా ఉందంటూ ఇది రైతు శుత్రు ప్రభుత్వంగా మారింద‌న్నారు.

కాగా, . ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యారు

Advertisement

తాజా వార్తలు

Advertisement