హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజును గుర్తు చేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దీక్షా దివస్ నిర్వహిస్తుంది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఆనాటి ఉద్యమాన్ని గుర్తుచేసేందుకు బీఆర్ఎస్ దీక్షా దివస్ నిర్వహిస్తుంది. జిల్లాల ఇన్చార్జిల నేతృత్వంలో ర్యాలీలతో పాటు అమరవీరులకు నివాళులు, ఫొటో ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొంటున్నారు.
కరీంనగర్, తెలంగాణ భవన్ లో కేటీఆర్
కరీంనగర్, తెలంగాణ భవన్ వేడుకల్లో పాల్గొననున్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో భాగంగా ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్ బయలుదేరారు
ఉదయం 10:30 గంటలకు మానకొండూర్ నియోజకవర్గం, తిమ్మాపూర్ ఇరిగేషన్ ఆఫీసు వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం బైక్ ర్యాలీతో అలుగునూరు చౌరస్తా చేరుకుంటారు.ఉదయం 11 గంటలకు అలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తారు. .
ఉదయం 11:30 గంటలకు దీక్షదివాస్ కరీంనగర్ లోని అలుగునూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన దీక్షదివాస్ కార్యక్రమంలో పాల్గొంటారు కేటీఆర్.
.
. ఈ సమావేశంలో కాంగ్రెస్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది. “నేడు దీక్షా దివస్.. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన కేసీఆర్ దీక్ష.. తెలంగాణకు అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష. జై కేసీఆర్.. జై తెలంగాణ” అని బీఆర్ఎస్ పార్టీ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది..