Friday, November 22, 2024

TG – బిఆర్ఎస్ నుంచి మ‌రో వికెట్ డౌన్… రేవంత్ తో ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి భేటి

ఆంధ్ర‌ప్ర‌భ – హైద‌రాబాద్ – ఇప్ప‌టికే ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు హ‌స్తం తీర్ధం పుచ్చుకోగా తాజాగా మరోవైపు బీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్సీ కారు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమ‌వుతున్నారు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీరు అందించే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్సీ కోరినట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. అయితే పార్టీని వీడేందుకు చల్లా నేడు రేవంత్ క‌లిసిన‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.. రేపు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో టాక్.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement