Thursday, January 30, 2025

TG – ఈ కార్ రేస్ కేసులో రేవంత్ పై పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు

హైద‌రాబాద్ – ఫార్ములా ఈ- రేస్‌ కేసు వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీనియర్‌ నాయకుల బృందం నేడు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు చేసిన అనంతరం ఆర్‌ఎస్‌పీ మాట్లాడుతూ.. ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో సీఎం రేవంత్‌ రెడ్డి పేరు చేర్చాలని ఆర్‌ఎస్పీ ఫిర్యాదు చేశాం. రేవంత్‌ అనాలోచిత నిర్ణయాల వల్లనే రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయని, అందుకే ఆయనపై బీఎన్‌ఎస్‌ 316 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నాం.నేను రాజకీయాల్లో రాకముందు ఐపీఎస్ అధికారిగా పనిచేశాను. నేను కూడా క్రైమ్ బ్రాంచ్ డీసీపీగా ఎన్నో వైట్‌ కాలర్‌ నేరాలను పరిశోధించాను. అడిషనల్ డీజీపీగా పనిచేశాను. వార్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటింగ్ అధికారిగా ఐక్యరాజ్యసమితిలో పనిచేశాను. కానీ నేడు రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. లేని అవినీతిని పేపర్ మీద పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని, సమస్యను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement