నిజామాబాద్ ప్రతినిధి డిసెంబర్ 28:(ఆంధ్రప్రభ)అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చాననీ నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డ ను… దేనికీ భయపడననీ ఎమ్మెల్సీ కవిత అన్నా రు. కేసీఆర్ ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారనీ మండిపడ్డారు.మాది భయ పడే రక్తం కాదు.. భయపెట్టే రక్తమని చెప్పారు. మేము తప్పు చేయలేదు… భయ పడే ప్రసక్తే లేదన్నారు.ఎన్ని కేసులు పెట్టిన బీఆ ర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణి కల్లా బయటికి వస్తారన్నారు. రాబోయేది గులాబీ జెండా శకమే… అందులో సందేహమే లేదన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే నీ ధీమావ్యక్తం చేశారు.
లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి, విడుదలైన అనంతరం తొలి సారి ఇందూరుకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు నిజాంబాద్ జిల్లాలో గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
బీఆర్‌ఎస్ నేతలు, జాగృతి నాయకులు విస్తృత ఏర్పా ట్లు చేశారు. ఆదివారం ఇంద ల్వాయి టోల్ గేట్ వద్ద , అనంతరం డిచ్‌పల్లి వద్ద టిఆర్ఎస్ నాయకులు ఆడపడుచులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. డిచ్పల్లి నుండి నిజామా బాద్‌లోని సుభాష్‌నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వర కు అడుగడుగునా పూల వర్షం కురిపించారు. బాల్కొం డ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల లు ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం సుభాష్ నగర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదన్నారు. పేరు మర్చి పోయినా, రైతులు భూ ములు ఇవ్వకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని ఆరోపిం చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత భయమని ప్రశ్నించారు.
బరువు ఎత్తు కున్నోడు ఓపికతో ఉండాలనీ సూచించారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికే అధికారం ఇచ్చారన్న విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మరిచిపోయాయనీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వా ళ్లం .. .గట్టిగా నిలబడుతాం.. ప్రజల పక్షనా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు.
డిగ్రీ చదువుకున్న ఆడ పిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైంది?మహిళలకు నెలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వలేదనీ ప్రశ్నించారు. మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కా ర్ అమలు చేయలేదు బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం …. ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచ లేదన్నారు. మనం ఊరు కుంటే ప్రభుత్వం కదలదు… ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనీ పిలుపు నిచ్చారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిల దీయాలన్నారు.
విద్యార్థులు, రైతులు, మహిళలను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింద నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసాపై ప్రభుత్వం మాట్లాడడం లేదన్నారు. గురు కులాల్లో కలుషిత ఆహారం తిని ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్ట నపెట్టుకున్నారు.. ఇంకెంత మందిని పొట్టన పెట్టు కుంటారనీ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడే అని ఎద్దేవా చేశారు.
తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారనీ మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్భందాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదన్నారు.మళ్లొకసారి నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దామని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం
ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్సీ కవితకు గజ మాలతో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధ న్ కు ఘన స్వాగ తం పలికారు.
*డిచ్పల్లిలో*
డిచ్ పల్లి కి చేరుకున్న ఎమ్మె ల్సీ కవిత కు నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజి రెడ్డి గోవర్ధన్, బాజిరెడ్డి జగన్ మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విట్టల్ రావు రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి లు టిఆర్ఎస్ శ్రేణులు ఆడపడుచులు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బి ఆర్ఎస్ శ్రేణులు శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.