Wednesday, November 13, 2024

TG – మంత్రుల నిర్ల‌క్ష్యంతోనే కొట్టుకుపోయిన పెద్ద వాగు – బి ఆర్ ఎస్ పార్టీ గరం గరం

ట్విట్ట‌ర్ లో కాంగ్రెస్ స‌ర్కార్ పై బిఆర్ ఎస్ ధ్వ‌జం
అస‌మ‌ర్థ మంత్రుల వ‌ల్లే అపార న‌ష్టం
ఖ‌మ్మం జిల్లా మంత్రుల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – పెద్ద వాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన నేప‌థ్యంలో బిఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ స‌ర్కార్ పై విరుచుకుప‌డింది.. ఖమ్మం జిల్లా మంత్రుల నిర్లక్ష్యం కారణంగా పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, దీంతో రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని దుయ్య‌బ‌ట్టింది.. ఈ మేర‌కు ఎక్స్ లో ట్విట్ చేసింది ఆ పార్టీ .. పనికిరాని మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. శాఖల మీద పట్టులేకపోవడంతో, అనుభవరాహిత్యంతో జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

జిల్లాకు చెందిన మొదటి మంత్రి… పేరుకే ఉపముఖ్యమంత్రి అని, కానీ ఆయనను ఎవరూ పట్టించుకోరని పేర్కొంది. రెండో మంత్రి ముద్దుపేరు గడియారాల మంత్రి అని, ఎన్నికలు వచ్చినా వేడుక జరిగినా గడియారాలు పంచడం ఆయన హామీ అని విమర్శించింది. ఇక మూడో మంత్రికి శాఖాపరమైన సమావేశాలలో కూడా చోటు ఉండదని ఇది ఆయన స్పెషాలిటీ అని ఎద్దేవా చేసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెద్దవాగు ప్రాజెక్ట్ గేట్ల దగ్గర భారీ గండిపడిందని, దీంతో పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయిందని తెలిపింది. పెద్దవాగుకు గండిపడటంతో నీళ్లు గ్రామాల్లోకి వచ్చాయని, దీంతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపింది. భారీ వర్షం కారణంగా రాత్రికి రాత్రే వరద ముంచెత్తి ఇళ్లు కూలాయని, వందల సంఖ్యలో పశువులు మృతి చెందాయని పేర్కొంది. కాంగ్రెస్ అసమర్థ పాలనకు ఇది పరాకాష్ఠ అని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement