Friday, November 22, 2024

TG – అడుగ‌డుగునా రాజ్యాంగ ఉల్లంఘ‌నే … రేవంత్ స‌ర్కార్ పై గ‌వ‌ర్న‌ర్ కు బిఆర్ఎస్ ఫిర్యాదు


నేడు గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌సిన ఆ పార్టీ బృందం
ఉద్యోగ భ‌ర్తీ కోసం ఆందోళ‌న చేస్తుంటే
నిరుద్యోగ యువ‌తపై కూడా కేసులే
వ‌త్త‌డి తెచ్చి ఎమ్మెల్యేల‌కు హ‌స్తం తీర్థం
ప్రొటోకాల్ సైతం పాటించ‌డం లా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ హైద‌రాబాద్ – ఉద్యోగ భ‌ర్తీ కోసం శాంతియుతంగా ఆందోళ‌న చేస్తుంటే నిరుద్యోగుల‌పై సైతం కేసులు బ‌నాయిస్తున్నార‌ని, త‌మ ఎమ్మెల్యేల‌ను బ‌ల‌వంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ రాథాకృష్ణ‌న్ కు ఫిర్యాదు చేసింది బిఆర్ఎస్ పార్టీ .. ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయ‌క‌త్వంలో బృందం నేడు గ‌వ‌ర్న‌ర్ కు క‌ల‌సింది

- Advertisement -

అనంత‌రం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని గవర్నర్‌కు వివరించామని అన్నారు. నిరుద్యోగ యువతపై సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారన్నారు. మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. వీటన్నింటినీ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని.. దీనిపై గవర్నర్ స్పందించారన్నారు. హోమ్ సెక్రటరీని పిలిచి మాట్లాడతా అని అన్నారన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతుందని విమర్శించారు. పది మంది తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మేల్యే తమ టికెట్‌పై గెలిచి ఎంపీగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారన్నారు. దీన్ని గవర్నర్‌కు వివరించామన్నారు.

ప్రోటోకాల్ సమస్యలను వివరించామని తెలిపారు. దేశంలో ఉన్న అన్ని రాజ్యాంగ సంస్థలను కలుస్తామని తెలిపారు. రాష్ట్రపతిని కలిసి వివరిస్తామన్నారు. రాజ్యాంగం చేతిలో పట్టుకుని ఫోజులు కొడుతున్నారని, అదే రాజ్యాంగాన్ని హననం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే దాకా పొరాడతామన్నారు. త్వరలోనే మేడిగడ్డ సందర్శిస్తామని.. వరదను తట్టుకుని ఎలా నిలబడ్డదో ప్రపంచానికి చూపిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

కేసీఆర్‌కు శుభాకాంక్షలు: గవర్నర్
ముందుగా గవర్నర్‌‌ను కలిసిన కేటీఆర్ . బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఆయనకు పరిచయం చేశారు. యాదగిరి గుట్ట నిర్మాణాన్ని ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు. ‘‘ఇటీవల యాదాద్రిని సందర్శించాను. ఆగమ శాస్త్రం ప్రకారం అద్భుతంగా నిర్మించారు.కేసీఆర్‌కు నా శుభాకాంక్షలు చెప్పండి’’ అని అన్నారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యంపై గవర్నర్ ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement