Friday, October 25, 2024

TG – మరికొద్దిసేపట్లో మూసి నిర్వాశితులతో బిజెపి మహాధర్నా…

హైదరాబాద్ – మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద తెలంగాణ బీజేపీ నిరసనకు నేడు పిలుపునిచ్చింది. మరికొద్దిసేపట్లో ఇక్కడ మహాధర్నా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, మూసీ బాధితులు తదితరులు పాల్గొననున్నారు. కాగా, ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు ఇచ్చింది.

ఇది ఇలాఉంటే ఈ నెల 23 , 24 తేదీల్లో బీజేపీ నేతలు వరుసగా కార్యక్రమాలు నిర్వహించారు. మూసీ బాధిత పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. బీజేపీ నేతలు 9 బృందాలుగా ఏర్పడి పర్యటించారు. బాధితులకు భరోసా కల్పించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడితే బీజేపీ ఊరుకోదని పోరాడుతుందని నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, మూసీపై సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. డీపీఆర్ ఇవ్వకుండా అఖిలపక్షం మీటింగ్ ఏంటని ప్రశ్నించారు. మూసీ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సుందరీకరణ చేస్తే తాము మద్దతు ఇస్తామని బీజేపీ నేతలు అన్నారు.

రుణమాఫీ పూర్తయ్యేదాకా వదలం..

- Advertisement -

అలాగే ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది. ముఖ్యంగా రూ.2లక్షల రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేసేవరకూ వదలిపెట్టబోమని హెచ్చరించింది. బీఆర్‌ఎస్‌లాగే మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని కుండబద్ధలు కొట్టింది. లక్షలాది మంది రైతాంగానికి అండగా ఉంటామని ప్రకటించింది. రూ.2 లక్షల రుణమాఫీకి ఆంక్షలెందుకు విధించారని నిలదీసింది. రైతుల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. వారినే దారుణంగా మోసం చేస్తోందని మండిపడింది. ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారో అధికారిక ప్రకటన విడుదల చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement