Friday, September 6, 2024

TG – నేడు ఒరిస్సాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన

ఆంధ్ర ప్రభ స్మార్ట్ : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఒరిస్సా పర్యటించ నున్నారు . ఈ నేపద్యంలో ఆయన నేటి ఉదయం విమానం లో భువనేశ్వర్ కు బయలదేరారు

ఈ సందర్భంగా ఒరిస్సా ముఖ్యమంత్రితో నేడు భేటీ కానున్నారు . ఒరిస్సాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైని బొగ్గు బ్లాక్ తవ్వకాలకు కావలసిన అనుమతుల గురించి ఒరిస్సా సీఎంతో చర్చించనున్నారు భట్టి. ఒరిస్సా నైని బొగ్గు బ్లాక్ అనుమతులు సాధిస్తే సింగరేణికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement