హైదరాబాద్ – భవిష్యత్లో ఏ ప్రభుత్వం వచ్చినా మార్చకుండా ఉండేలా చూస్తామని శాసనమండలిలో డిప్యూటీ సీఎ భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ తల్లి స్వరూపం అనేక రూపాల్లో ఉన్నాయని అన్నారు.
తెలంగాణ తల్లి ప్రతి రూపాన్ని రూపకల్పన చేసి సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. తెలంగాణ తల్లి ప్రతి రూపాన్ని చారిత్రక, సంస్కృతికి అద్దం పడుతూ.. కంటే, హారంతో, కాళ్ళకు మెట్టెలతో, పచ్చని చీరతో, మన పంటలకు చిహ్నంగా రూపొందించామన్నారు.
తెలంగాణ తల్లికి వాడిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉందని భట్టి అన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేందుకు టీజీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని భట్టి తెలిపారు. జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. ప్రతి ఏడాది 9వ తేదీని తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పేరు మార్పును కూడా పరిశీలిస్తామని అన్నారు.