Friday, September 20, 2024

TG – మొన్న మేడిగడ్డ, నేడు సుంకిశాల – ఆ పాపం బి అర్ ఎస్ దే – ఉప ముఖ్యమంత్రి భట్టి

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ; మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు సుంకిశాల పాపం బీఆర్‌ఎస్‌దేనని తెలంగాణ ఉప: ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆ నెపం వేరొకరి మీద వేయడం దారుణమని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ హయాం నాటి ప్రాజెక్టు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. నాసిరకమైన కట్టడం, డిజైన్ లోపం కారణంగానే 2021లో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిందని తెలిపారు.కూలే గోడలు కట్టించి మరొకరిపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు .

తమ తప్పిదాలు, పాపాలను మరొకరిపై రుద్దేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 2021లో చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిందని, సాగర్‌లో నీళ్లు వచ్చినందునే గోడ కూలిందని ఆరోపిస్తున్నారని భట్టి తెలిపారు.

- Advertisement -

బీఆర్‌ఎస్‌ హయాంలోనే సుంకిశాల ప్రాజెక్టు చేపట్టారని విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని టీజీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో వర్షాల దృష్ట్యా చేప్టటాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం : సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.సుంకిశాల ప్రాజెక్టు బీఆర్‌ఎస్‌ హయాంలోనే చేపట్టారు. సాగర్‌లో నీళ్లు వచ్చినందునే గోడ కూలిందని ఆరోపిస్తున్నారు. నీళ్ల కోసమే కదా సాగర్ కట్టింది. గత ప్రభుత్వ ప్రాజెక్టు డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా అర్థమవుతోందన్నారు .

మీ(బీఆర్ఎస్) కట్టడాలు, మీ పాలన ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. సుంకిశాల ప్రాజెక్టు మేం కట్టింది కాదు, మా హయాంలో చేపట్టిన ప్రాజెక్టు కాదు. మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం మీ(బీఆర్ఎస్)కే చెందుతుందని వ్యాఖ్యానించారు.

.తెలంగాణలో పెట్టుబడులకు కార్పొరేట్‌ పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా ఎదుగుతోందన్నారు. విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్‌ సమస్యలు ఏమైనా ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 1912కు తెలపాలని భట్టి సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించామని గుర్తు చేశారు. కంట్రోల్‌ రూమ్‌ ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పారు. మరోవైపు, పదోన్నతుల విషయంలో ఉద్యోగులతో చర్చించాలని ఆదేశించామని డిప్యూటీ సీఎం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement