Saturday, September 7, 2024

TG – పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయండి …. ఉప ముఖ్యమంత్రి భట్టి

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – రాష్ట్రంలో అదిలాబాద్, ఖమ్మం, మహబూబూ నగర్, వరంగల్ వంటి జిల్లాల్లో పచ్చని, దట్టమైన అడవులు.. జలపాతాలు ఉన్నాయ‌ని,. వాటిని గుర్తించి ఐటీ ఉద్యోగులు, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, బడ్జెట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

గత ఏడు నెలలుగా సాంస్కృతిక సారధి కళాకారుల ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారని బట్టి మల్లు ఆరా తీశారు. కళాకారులను సమాజ అభివృద్ధికి పూర్తిగా వాడుకోవడం లేద‌ని.. వారి సేవలు వినియోగించుకునేందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో అనేక నిర్మాణాలు ప్రారంభించి మధ్యలో వదిలేసింద‌ని, ఫలితంగా వందలాది కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగమైంద‌న్నారు.

- Advertisement -

గతంలో ప్రారంభించి 90 శాతం పూర్తి చేసిన భవనాలను గుర్తించి నిర్మాణాలు పూర్తి చేయాల‌ని, మిగిలిన భవనాలు దశలవారీగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో క్రీడామైదానాలు ఉన్నాయ‌ని, . వాటిని నిరుపయోగంగా ఉంచడం మూలంగా ఆక్రమణలు జరుగుతున్నాయని వివ‌రించారు డిప్యూటీ సిఎం.. అధికారులు వెంటనే స్పందించి.. నిత్యం క్రీడలు నిర్వహించి… మైదానాలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని రెసిడెన్షియల్ విద్యార్థులకు క్రీడా మైదానాల్లో క్రీడలు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొన్నిచోట్ల క్రీడామైదానాలు ఆక్రమణలకు గురైనట్టుగా సమాచారం ఉంది.. వెంటనే ఆ విషయాలపై దృష్టి సారించి ఆక్రమణ దారులను ఖాళీ చేయించండి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ఏడాది మొత్తంగా ప్రభుత్వ క్రీడా మైదానాల్లో యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పర్యాటక శాఖ సొంత ఆస్తులు, లీజ్ లో ఉన్న ఆస్తుల వివరాలపై ఒక సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, అడవులను పర్యాటక సాంస్కృతిక శాఖలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుని ఆదాయం పెంచుకోవాలని సూచించారు భ‌ట్టి.

కల్చర్ అంటే ఆటలు పాటలు అనుకుంటున్నార‌ని, .. కానీ కల్చర్ అంటే జీవన విధానం అని చాలామందికి తెలియదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కళాకారులు ప్రజల జీవన విధానంలో మెరుగైన మార్పులు తెచ్చేందుకు తీసుకునే ఆహారం, వేసుకునే దుస్తులు ఇలా అన్ని అంశాల పైన గ్రామీణ ప్రజానీకాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి అన్నారు. రాష్ట్రంలో ఉన్న చెక్ పోస్ట్ లను పూర్తిస్థాయిలో ఆధునికీకరించేందుకు సమగ్ర ప్రణాళికలు చేయాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు.

రాష్ట్రంలో సంస్కృతి, వారసత్వ సంపదలు ఘనంగా ఉన్న ఆ మేరకు వాటిని వినియోగించుకుని పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేకపోతున్నాం, రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు దృష్టి సారించాలని మంత్రి జూపల్లి ఆదేశించారు.

ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వాణిజ్య పన్నుల శాఖ ఉన్న‌తాధికారి ఎస్ ఎ రిజ్వి, ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, యూత్ సర్వీసెస్ డైరెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి శ్రీధర్, ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలికేరి, టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాష్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement