Friday, November 22, 2024

TG – ప‌న్నుల రూపంలో వ‌చ్చే ప్ర‌తి పైసా ప్ర‌జ‌ల కోసమే … ఉప ముఖ్యమంత్రి భట్టి

రైతు భ‌రోసా స‌మావేశంలో భ‌ట్టి వెల్ల‌డి
అన్న‌దాత‌ల అభిప్రాయంతో భరోసా పంపిణీ
మంత్రుల క‌మిటీ మీటింగ్ లో అభిప్రాయాలు చెప్పిన రైత‌న్న‌లు

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – హ‌నుమ‌కొండ – ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన రైతు భరోసా పథకం అవగాహన సదస్సుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు. రైతు భరోసా విధివిధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మక మైన హామీలను నెరవేర్చిందన్నారు. మాది ప్రజా ప్రభుత్వంమ‌ని, ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామన్నారు. అడ్డుగోలుగా వాటిని దుర్వినియోగం చేయమని తెలిపారు.

- Advertisement -

రైతు బంధులోనూ అక్ర‌మాలు ..

రైతు బంధులో తప్పులు జరిగాయని మంత్రి సీతక్క అన్నారు. నిజానికి వ్యవసాయం చేసిన రైతులకు కాకుండా పట్టాలు ఉన్న వారికి మాత్రమే రైతు బందు గతంలో ఇచ్చారన్నారు. పట్ట బందు గానే మారిందన్నారు. 40 ఏళ్ల క్రితం భూము అమ్ముకొని పేరు మరకపోవడం తో సాగు చేసే రైతులకు పెట్టు బడి రాలేదన్నారు. ఈ లాంటి సదస్సులో గతంలో జరిగిన లోపాలను సరి చేసి నిజమైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సదస్సు మంచి వచ్చే సూచనతో రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

నిజ‌మైన రైతుల‌కే భ‌రోసా

మరోవైపు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రైతు బంధు పథకం లో భూ స్వాముల లకు కాకుండా నిజమైన రైతులకు ఇవ్వాలని తెలిపారు. గత ప్రభుత్వం హయం లో భూ స్వాముల కు లక్షల రూపాయలు పొందారన్నారు. నిజమైన రైతులకు ఆడాల్సిన పెట్టుబడి సహాయం ఆడలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో రైతులకు సబ్సిడీలు అందాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగిందన్నారు. పశువులకు కూడా ఇన్స్యూరెన్స్ చేయించాలన్నారు. పశువులు చనిపోతే రైతులకు నష్టం జరుగుతోందని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో స‌భ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, ఉమ్మ‌డి వరంగల్ జిల్లా ఇంచార్ట్, రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్, ఎం ఎల్ సి బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే లు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, రేవురి ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, యశశ్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళి నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఆదనవు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement