Monday, October 7, 2024

TG – ప్రజల మేలు కోసమే హైడ్రా – ఉప ముఖ్యమంత్రి భట్టి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : ‘హైడ్రా’పై నిరాధార‌మైన‌ ఆరోపణలతో ప్రతిపక్షాలు ప్రజలను త‌ప్పుదోవ పట్టిస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. సోమ‌వారం స‌చివాల‌యంలో మీడియాతో భ‌ట్టి మాట్లాడారు. గతంలో హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి నగర పరిధిలో చాలా చెరువులు, పార్కులు, కబ్జాలకు గురయ్యాయని, కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ వ్యక్తిగత అజెండాలు లేవని భట్టి స్ప‌ష్టం చేశారు.

గ‌తంలోనూ మూసీ ప్ర‌క్షాళ‌న‌కు ప్ర‌యత్నాలు గతంలోనూ చెరువులను కాపాడటంతో పాటు మూసీ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరిగాయని, కానీ కాలక్రమేణా ఆ పనులకు పలుమార్లు బ్రేకులు పడ్డాయని విక్ర‌మార్క‌ తెలిపారు. నగరం నడిబొడ్డున ఉన్న మూసీని మణిహారంగా మార్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. శాటిలైట్ ఆధారిత సర్వేతో కబ్జాలపై పూర్తి సమాచారాన్ని ఇప్పటికే అధికారులు సేకరించారని ఆయన తెలిపారు

. మాది ప్ర‌జా ప్ర‌భుత్వం తమది ముమ్మాటికీ ప్రజా ప్రభుత్వమని డిప్యూటీ సీఎం అన్నారు. పారదర్శక ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఓ మంచి పనిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని భట్టి విక్రమార్క ఆక్షేపించారు. కేవలం ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement