బూర్గంపాడు, (ప్రభ న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మానవత్వాన్ని చాటుకున్నారు. బూర్గంపహాడ్ మండలం సారపాక క్రాస్ రోడ్డు వద్ద ఆటో, బైక్ ఢీకొన్నాయి.. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అదే సమయంలో అటుగా వెళ్తున్న కొత్త కలెక్టర్ జితేష్ పాటిల్ వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను సొంత వాహనంలో ఆస్పత్రికి పంపి మానవత్వం చాటుకున్నారు. కొత్త కలెక్టర్గా విధులకు హాజరైన వెంటనే కలెక్టర్ జితేష్పాటిల్ చూపిన మానవతా విలువలపై జిల్లా ప్రజలు ప్రశంసలు కురిపించారు.