అంబేద్కర్ ను అవమానించిందే కాంగ్రెస్
ఆ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దారుణం
అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చిందే బిజెపి
కాంగ్రెస్ పై మండి పడ్డ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్
హైదరాబాద్ – రాజ్యాంగ నిర్మాత డాక్టర్బీఆర్ అంబేద్కరస్ఫూర్తితో బీజేపీ పార్టీ ముందుకు కెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో వాజ్పేయీ శతజయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి ఆయన పా ల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కోసం మాట్లాడటం దారుణమన్నారు. అంబేద్కర్ కు అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్ కు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 1954 నుంచి 88 వరకు నెహ్రు, ఇందిరగాంధీ సహా 21 మందికి భారత రత్న ఇచ్చారని, కానీ అంబే ద్కర్ ను ఎందుకు విస్మరించిందో కాంగ్రెస్పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, అబద్దాలల్లో కాంగ్రెస్ పార్టీకి అస్కార్ అవార్డు ఇవ్వొచ్చని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని అన్నారు. అబద్ధాలతో ముందుకు వెళ్తున్న పార్టీ కాంగ్రెస్ అంటూ విమర్శించారు. దేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత వాజ్ పేయీ అని అంటూ . భారత దేశ వైభవాన్ని, నైతిక విలు వలకు ప్రపంచానికి చాటి చెప్పారన్నారు.. ఆయన ఎప్పుడూ పదవులకు ఆశపడకుండా నిస్వార్థంగా పని చేశారని ప్రశంసించారు.. ఒక్క ఓటుతో అధికారం కో ల్పోయినా ప్రజాతీర్పు కోరి మళ్లీ అధికారంలోకి వచ్చారన్నారు..ప్రధాని . మోదీ ఆయన ఆశయాలను తూచ తప్పకుండా అమలు చేస్తుంది’ అని బండి సంజయ్ అన్నారు.