కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్
హైడ్రాకు తొలి మద్దతు ఇచ్చింది నేనే
తాజా చర్యలతో నమ్మకం పోయింది
పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారు
ఇది ముమ్మాటికి డైవర్షన్ పాలిటిక్స్..
హైదరాబాద్ – హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఆరోపించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా హైడ్రాతో డైవర్ట్ చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, ఈ చర్యలతో హైడ్రా పై విశ్వాసం పోతుందన్నారు.. తాను మొదట హైడ్రాకి సపోర్ట్ చేశానని వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా తో సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలను కొట్టాలని అంటూ పేదలను ఇబ్బంది పెట్టొద్దన్నారు. పేదల ఇళ్లను కూలుస్తున్నారని అన్న ఆయన సామాన్యులను ఇబ్బందులు పెడితే ఊరుకోమన్నారు.
బిజెపి ఓట్ల శాతం పెరగాలి ..
తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో 77 లక్షల ఓట్లు వచ్చాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ఎక్కువగా సభ్యత్వం చేయాలన్నారు. పార్టీ కోసం పని చేసే వారికే టికెట్ పైరవీలు తన దగ్గర నడవదని తెలిపారు. ఇచ్చిన మాట తప్పకుండా పార్టీ కోసం పని చేసిన వారికి సీట్లు ఇచ్చి మాట నిలబెట్టుకుంటా అన్నారు. కాంగ్రెస్ పై ప్రజల్లో విరక్తి స్టార్ట్ అయ్యిందని తెలిపారు. బీఆర్ ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అన్నారు. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం కేసీఆర్ యాగాలు చేయాలన్నారు. బిడ్డ జైలు నుంచి బయటకు రాగానే యాగం చేస్తున్నారని విమర్శించారు.