Sunday, September 22, 2024

TG – అమృత్‌ ప‌థ‌కం అక్ర‌మాల‌పై ఫిర్యాదు చేస్తే విచారిస్తాం – బండి సంజయ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, క‌రీంన‌గ‌ర్ : అమృత్ పథకం అక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుంద‌ని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఓటుకు నోటుకు కేసు ఎందుకు విచారణ జరపలేద‌న ప్ర‌శ్నించారు. కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ లోపాయికారీ ఒప్పందం ఉంద‌ని ఆరోపించారు.

కరీంనగర్ లో నేడు ఆయన మీడియా తో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అవినీతిలోకి కూరుకుపోయింద‌ని బండి అన్నారు. కొంతమంది కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నార‌ని ఆరోపించారు.

హైడ్రాకి వ్య‌తిరేకం కాదు

తాను హైడ్రాకి వ్య‌తిరేకం కాద‌ని కేంద్ర మంత్రి అన్నారు. అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు కార‌ణ‌మైన బీఆర్ ఎస్ నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. నిష్పాక్షిపాతంగా కూల్చివేత‌లు చేప‌ట్టాల‌న్నారు. చెరువులు ఆక్ర‌మించిన ఎంత‌టి వారియినా చ‌ర్య తీసుకోవాల‌న్నారు.

- Advertisement -

హిందూ ధ‌ర్మంపై దాడి

తిరుప‌తి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ హిందూ ధ‌ర్మంపై దాడి అని బండి అన్నారు. తిరుపతి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వాడ‌టం హిందువుల మనోభావాలు ను దెబ్బ తీయడమే అని అన్నారు. ప‌విత్ర‌మైన తిరుమ‌ల ప్ర‌సాదంలో క‌ల్తీ చేశారని ఆరోప‌ణ‌లు చేయ‌డం సిగుచేట‌న్నారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించార‌ని చెప్పారు.టీటీడీలో అన్య‌మ‌త‌స్తుల‌కు చోటు క‌ల్పించ‌కూడ‌ద‌ని అన్నారు.

ఉగ్ర‌వాదుల‌న పెంచి పోషించేది ఎంఐఎం అని బండి అన్నారు. ఓవైసీ కాలేజీలో ప‌నిచేస్తున్న‌ఫ్యాక‌ల్టీ ఉగ్ర‌వాదిగా ప‌ట్టుబ‌డిన‌ట్లు చెప్పారు. 15 నిమిషాలు కేటాయిస్తే నరికి చంపుతాన్నన ఓవైసీ కి ఏం ఫోబియా ఉంద‌న్నారు. హిందూ దేవుళ్ల‌ను కించ ప‌రుస్తార‌ని, ఎంఐఎం నేతలు ఇప్పటికీ జాతీయ గీతం ఆలపించర‌ని చెప్పారు.

ఓల్డ్ సీటు న్యూ సీటు గా మారుస్తానన్న వ్యాఖ్యలను ముస్లిం పెద్దలే సమర్థించార‌ని గుర్తు చేశారు. సెక్యులర్ అనేవాళ్లు హిందువుల పండుగ ఏనాడైనా జరుపుకున్నారా అని ప్ర‌శ్నించారు.

చురుగ్గా స‌భ్య‌త్వ న‌మోదు

తెలంగాణ‌లో చురుగ్గా స‌భ్య‌త్వ న‌మోదు జ‌రుగుతుంద‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ అన్నారు. మెంబర్ షిప్ అభ్యయాన్ లో భాగంగా ప‌ది కోట్లు సభ్యత్వాలు నమోదు చేయాలని టార్గెట్ అని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సభ్యత్వ నమోదు వేగంగా జరుగుతోంద‌ని, ఈ నెల 25 వ తేదీ మెంబర్ షిప్ డ్రైవ్ చేయాలని పార్టీ అధినాయకత్వం నిర్దేశించింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement