హైదరాబాద్ – సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలపాలై కిమ్స్‌లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీ తేజ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు.
ఈరోజు సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ తండ్రి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన బండి సంజయ్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, స్థానిక బీజేపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ . శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని బండి ఆకాంక్షించారు.
పరస్పర రాజకీయ విమర్శలను బంద్ చేయాలని కోరారు. ఈ విషయం రాజకీయం చేయడం ఆపేయండని అన్నారు. బాబు కోలుకోవాలని ముందు కోరుకోండని తెలిపారు. ప్రతి ఒక్కరూ శ్రీతేజ్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధించాలని బండి సంజయ్ కోరారు.
- Advertisement -