ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:జన్వాడలోని రాజ్ పాకాల ఫాంహౌజ్‌లో రేవ్ పార్టీ జరగడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్‌గా ఆదివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో.. బామ్మర్ది ఫాంహౌజ్‌లోనే రేవ్ పార్టీలా? డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తాడేమో. సుద్దపూసను కావాలనే తప్పించారనే వార్తలొస్తున్నాయ్.’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ విరుచుకుపడ్డారు..
అందరినీ అరెస్టు చేయాల్సిందే..సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్న డ్రగ్స్‌పై రాజీధోరణి ఎందుకు? అని సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పొలిటిక్స్ సిగ్గు చేటని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
డీ
సీసీటీవీ ఫుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాల్సిందేనని అన్నారు. బడా నేతలతోసహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్ట్ చేయాలని బండి డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలుండాలన్నారు.