Friday, November 22, 2024

TG – నిత్యం అబ‌ద్దాలు ఆడే వారి నోటీసుల‌కు విలువెక్క‌డ‌ …కెటిఆర్ లీగ‌ల్ నోటీస్ కు బండి కౌంట‌ర్


ఆయ‌న ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాలే
నేనే ఆయ‌న‌పై లీగ‌ల్ యాక్ష‌న్ కు సిద్ధ‌మ‌వుతున్నా
బిఆర్ఎస్ లో కెటిఆర్, హ‌రీష్ మ‌ధ్య లడాయి
తెలంగాణ‌లో రేవంత్,కెటిఆర్, హ‌రీష్ ప్ర‌భుత్వ‌మే ఉంది
ఈ రెండు పార్టీలు నాట‌కాలాడుతున్నాయి
సంక్షేమాన్ని గాలికొదిలి ఆందోళ‌నంటూ రాజ‌కీయం చేస్తున్నాయి

విశాఖ‌ప‌ట్నం – ఫోన్‌ట్యాపింగ్‌, మాద‌కద్ర‌వ్యాల వ్య‌వ‌హారాల‌లో త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేశారని , దీనిపై కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ . వారంలోపు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, లేనిప‌క్షంలో చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని కెటిఆర్ ఆయ‌న‌కు లీగ‌ల్ నోటీస్ పంపారు.. దీనిపై బండి స్పందిస్తూ, నిత్యం అబ‌ద్దాలు చెప్పే వాళ్లు ఇచ్చే నోటీసులకు విలువ ఏముంటుంద‌ని అన్నారు. విశాఖ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, లీగ‌ల్ నోటీసుల్లో కేటీఆర్ చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ నిరాధార‌మైన‌వి, అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. దురుద్దేశ‌పూర్వ‌కంగానే త‌న‌కు లీగ‌ల్ నోటీసులు ఇచ్చార‌ని తెలిపారు. త‌న‌పై కెటిఆర్ చేసిన వ్యాఖ్యాల‌పై తాను కూడా త్వ‌రలోనే ఆయ‌న‌కు నోటీస్ పంపుతాన‌న‌ని అన్నారు..

బిఆర్ఎస్ లో కెటిఆర్ , హ‌రీష్ ల మ‌ధ్య ల‌డాయి

బీఆర్ఎస్ పార్టీ లో కేటీఆర్, హరీశ్ రావు మధ్య పంచాయతీ నడుస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బండి సంజ‌య్. ఇక రాష్ట్రంలో ఆర్.కే.హెఎచ్ (రేవంత్, కేటీఆర్, హరీష్‌రావు) ప్రభుత్వం నడుస్తోందని కామెంట్ చేశారు. బిఆర్ ఎస్ ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారంటూ ఆరోపించారు.. రెండు పార్టీలు కూడ‌బ‌లుక్కుని ఆందోళ‌ల‌ను అంటూ సంక్షేమ ప‌థ‌కాల‌ను అట‌కెక్కిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.

- Advertisement -

బామ‌మ‌రిది ఇంటిలో మందు దొరికితే ధ‌ర్నాలా..

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల మందు దందాలో దొరికితే బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసింది కాక.. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు కేసీఆర్ లేకపోతే.. కేటీఆర్ ను ఎవరూ పట్టించుకోరని అన్నారు.

మూసి పున‌రుజ్జీవానికి అనుకూల‌మే కానీ..

తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని.. పేదలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు బండి సంజ‌య్. పేద‌లు జోలికి వ‌స్తే ఊరుకోబోమ‌ని కాంగ్రెస్ స‌ర్కార్ ను హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement