Friday, November 22, 2024

TG – కెసిఆర్ సర్కార్ స్కాంలపై చర్యలు ఎప్పుడు – రేవంత్ ను నిలదీసిన బండి

హైదరాబాద్ – బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవినీతి, స్కాములపై కాంగ్రెస్ సర్కార్ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల టైంలో గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చిన రేవంత్ సర్కార్..ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ కమిషన్ గడువును ప్రభుత్వం మరో 2 నెలల పాటు పొడగించడంతో ఆదివారం ‘ఎక్స్’ వేదికగా బండి సంజయ్ పోస్టు పెట్టారు. ఇది అంతులేని పొడిగింపులు అంటూ ధ్వజమెత్తారు.

కాగా, కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి న్యాయ విచారణకు రేవంత్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయగా.. తొలుత 100 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని కోరింది. కానీ, పలు కారణాలతో ఇప్పటికే 2 సార్లు పొడిగించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement