Monday, October 7, 2024

TG | నిబంధనలు పాటించని వ్యాపారులపై బల్దియా కొరడా…

నిజామాబాద్ ప్రతినిధి ( ప్రభా న్యూస్) : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వ్యాపార వాణిజ్య సంస్థలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తూ… నిబంధన పాటిం చని వ్యాపార ,వాణిజ్య కేంద్రాలపై మున్సి పల్ కార్పొరేషన్ బల్దియా కొరడా ఘులిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అర్సపల్లి ప్రాంతంలోని సిటీ హాస్పిటల్, నాలెడ్జ్ పార్క్ స్కూల్‌కు మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం నోటీసులు జారీ చేసింది.

నిజామాబాద్ నగరంలోని పలు వ్యాపార వాణిజ్య కేంద్రాలపై డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో శానిటేషన్, రెవెన్యూ బృందం తనిఖీలు చేపట్టారు. ప్రాపర్టీ టాక్స్ సక్రమంగా చెల్లిస్తున్నారా, ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉన్నారా, యూజర్ చార్జీలు చెల్లిస్తున్నారా అనే కోణంలో అన్ని ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు.

అంతే కాకుండా ప్రాపర్టీ టాక్స్ కు సంబంధించి భవనానికి సంబంధించిన కొలతలు చేస్తున్నారు. కొలతల్లో వ్యత్యాసం వస్తే నోటీసులు జారీ చేసి అనంతరం ప్రాపర్టీ టాక్స్ సవరణ చేయబడుతుందని డిప్యూ టీ కమిషనర్ రాజేంద్ర కుమార్ తెలిపారు.

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుని సిటీ హాస్పిటల్ నోటీసులు

ప్రతి సంవత్సరం వ్యాపార కేంద్రాలు ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలి. కానీ ఇందుకు సంబంధించిని సిటీ హాస్పిటల్ ట్రేడ్ లైసెన్సు రెన్యువల్ చేసుకోలేదు. అంతేకాకుండా ప్రాపర్టీ టాక్స్ కు సంబం ధించి కూడా కొలతల్లో కొంత వ్యత్యాసం వచ్చింది. అంతేకాకుండా హాస్పిటల్ కు సంబంధించిన వ్యర్థ పదార్థాలకు సంబం ధించి పూర్తి వివరాలను వెంటనే ఇవ్వాల ని సిటీ హాస్పిటల్ కి కార్పొరేషన్ ఆదేశించారు.

- Advertisement -

అదేవిధంగా సిటీ కేర్ ఆస్పత్రి భవనానికి సంబంధించి పార్కింగ్ స్థలంలో వాహనాలు పార్కు చేయకుండా ఆస్పత్రి వ్యవహారాలు కొనసాగించడంపై కార్పొరేషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అంతే కాకుండా వాహనాలను హాస్పిటల్ ముందు రోడ్డుపై పార్కు చేయడంపై కూడా మండిపడ్డారు. తీరు మార్చుకోవాలని అధికారులు హెచ్చరించారు. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోకపోవడంతో నోటీసులు జారీ చేశారు.

నాలెడ్జ్ పార్కు పాఠశాలకు నోటీసులు

నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో గల నాలేజ్ పార్క్ పాఠశాలలో కార్పొరేషన్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రాపర్టీ టాక్స్ సంబంధించిన కొలతలు చేపట్టగా… వ్యత్యాసం ఏర్ప డింది. సుమారు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు కార్పొరేషన్ కు చెల్లించే పనులు తేడా వచ్చింది. అన్ని పత్రాలను అధికారులు పరిశీలించారు. కొలతల్లో తేడా రావడంతో నాలెడ్జ్ పార్క్ పాఠశాలకు కార్పొరేషన్ నోటీసులు జారీ చేశారు.

కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడితే ఉపేక్షించేది లేదు… : డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వ్యాపార వాణిజ్య సంస్థలు కార్పొరేషన్ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చర్యలు తప్పవని డిప్యూటీ కమిషనర్ రాజేంద్రకుమార్ హెచ్చరించారు. ప్రతి వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ ప్రాపర్టీ టాక్స్, యూజర్ చార్జీలు క్రమం తప్పకుండా చెల్లించాలని అదేవిధంగా ప్రతి సంవత్సరం ట్రేడ్ లైసెన్స్ తప్పకుండా రెనువల్ చేసుకోవాలని సూచించారు. వ్యాపార ,వాణిజ్య కేంద్రాలు ఇందుకు సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement